సినిమా జయాపజయాలతో పని లేకుండా వరుస సినిమాలు చేసుకుంటా వెళ్తున్నాడు శర్వానంద్. ఇప్పటికే ఈ యంగ్ హీరో చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. వీటిలోనే శర్వానంద్ హీరోగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీకార్తీక్ దర్శకత్వంలో ఎస్.ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు నుండే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అమల అక్కినేని నటిస్తున్నట్టు తెలుస్తుంది. సెలక్టివ్ సినిమాల్లోనే నటించే అమల అక్కినేని, కథ, తన పాత్ర నచ్చడంతో ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారట. శర్వానంద్ తల్లిపాత్రలో నటిస్తుంటే.. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ తండ్రి, నటుడు రవి రాఘవేంద్ర హీరో తండ్రి పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శర్వానంద్, అమల అక్కినేని, రవి రాఘవేంద్ర పాత్రల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.
కాగా ఈ సినిమాలో `పెళ్ళిచూపులు` ఫేమ్ రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. నాజన్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతాన్ని, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.ఈ చిత్రాన్ని 2020 సమ్మర్‌లో గ్రాండ్ రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: