తన సినిమాలతో ఎప్పుడూ సెన్సేషన్ క్రియేట్ చేసే వర్మ ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆర్ జి వి దర్శకత్వంలో కమ్మరాజ్యం లో కడప రెడ్లు మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు పాటలను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. అందులో ముఖ్యంగా ‘బాబు చంపేస్తాడు’ అనే మూడో పాటతో వివాదాస్పదమైన పదాలతో మరోసారి వర్మ వివాదానికే తెరతీశాడు. ఇండైరెక్ట్ గా బాబు ను టార్గెట్ చేసి ఈ పాటను రిలీజ్ చేసాడు. ఇప్పుడు తాజాగా మరో పాటను రిలీజ్ చేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. రేపు కే.ఏ పాల్ పై పాటను రిలీజ్ చేస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఈ గ్యాప్ లో ఈ పాట ప్రోమోని రిలీజ్ చేసాడు వర్మ. మరి చూద్దాం ఈ పాట పై ఎంత దుమారం రేగుతుందో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Another song from KAMMA RAJYAMLO KADAPA REDDLU releasing tmrw mrng 2nd Nov at 9.36 AM ..it’s on a WORLD FAMOUS person named K A PAUL ..MAY GOD BLESS US ALL..AMEN #KRKR #KApaulSONG pic.twitter.com/dLcSV8F92x
— Ram Gopal Varma (@RGVzoomin) November 1, 2019
కాగా అజయ్ మైసూర్ సమర్పణ లో టైగర్ కంపెనీ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ ముగింపు దశలో ఉన్న ఈ సినిమాను తొందర్లోనే రిలీజ్ చేసే ప్లాన్ చేసే యోచనలో ఉన్నాడు వర్మ. ఈ సారి ఏకంగా రెండు వర్గాల పేర్లనే తీసుకొనే వర్మ సినిమా చేస్తున్నాడు.. మరి చూద్దాం ఈ సినిమా ఎన్ని వివాదాలకు దారి తీస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: