ఆవిరి తెలుగు మూవీ రివ్యూ

యదార్ధ సంఘటన ఆధారంగా రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆవిరి’. దిల్ రాజు శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బేన‌ర్ పై ‘స్పాట్ స్పిరిట్’ అనే కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై టీజర్, ట్రైలర్ లతో అంచనాలు పెంచేసాడు రవిబాబు. మరి రవిబాబు పెట్టుకున్న అంచనాలను ఈ సినిమా రీచ్ అయిందో? లేదో? తెలియాలంటే మాత్రం రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

నటీనటులు : రవిబాబు, నేహా చౌహాన్, శ్రీముక్త‌
దర్శకత్వం : రవిబాబు
నిర్మాత‌లు : దిల్ రాజు
సంగీతం : వైద్ద్య్
సినిమాటోగ్రఫర్ : సుధాకర్ రెడ్డి

కథ:

రాజ్‌ కుమార్ రావు (రవిబాబు) తన భార్య లీనా( నేహా చౌహాన్) ఇద్దరు కూతుర్లు శ్రేయ, మున్నీ లతో హ్యాపీ గా జీవితం గడుపుతుంటాడు. అయితే అనుకోని కారణంవల్ల రాజ్ కుమార్ పెద్ద కూతురు శ్రేయ చనిపోవడంతో… ఫ్యామిలీతో పాటు వేరే ఇంటికి వచ్చేస్తాడు. అదే టైంలో తనకి అదే ఇంట్లో ఉన్న ఓ ఆత్మతో పరిచయం ఏర్పడుతుంది. ఆ దెయ్యం మునిని లోబర్చుకోవడంవల్ల తను చెప్పింది చేస్తుంది ముని. ఆ తర్వాత ఓ రోజు సడన్ గా మున్ని కనపడకుండా పోతుంది. ఇక అక్కడి నుంచి రవిబాబు ముని ఎక్కడికి వెళ్ళింది? ఇంతకీ ఆ దెయ్యం ఎవరు? మునిని బయటకు ఎందుకు తీసుకు వెళ్లాలనుకుంది, చివరకు ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

మొదటినుండి విభిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు రవిబాబు. సినిమాలు హిట్లు ప్లాప్స్ తో పనిలేకుండా ప్రయాగాలు చేస్తూనే వున్నాడు. ఇటీవలే పందిపిల్లతో ‘అదుగో’ లాంటి సినిమా తీసాడు. ఇప్పుడు మరో సారి తన ఓల్డ్ ఫార్ములానే నమ్ముకొని.. ‘స్పాట్ స్పిరిట్’ అనే కొత్త కాన్సెప్ట్ తో వచ్చాడు.

ఇక సినిమా విషయానికొస్తే ఇలాంటి సినిమాల్లో నటించడం రవిబాబుకి కొత్తెం కాదు. ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నాడు. కూతురు ఆపదలో ఉన్న తండ్రి పాత్రలో రవిబాబు చూపించిన ఎమోషన్స్ చాలా బావున్నాయి. విభిన్నమైన స్టోరీలైన్‌తో స్క్రీన్‌ప్లేతో మెప్పించాడు. సినిమాపై పెరిగిన అంచనాలను నిలబెట్టి…హర్రర్‌ సీన్స్‌తో అలరించాడు. సినిమాలోని ఇంటర్వెల్ అండ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే హర్రర్ సన్నివేశాలు బావుంటాయి.

ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీ ముక్త గురించి చెప్పుకోవాలి. తను చేసిన నటన చాలా బాగుంది. తనకి ఇచ్చిన ప్రతి ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా చూపించింది. ఒకరకంగా చెప్పంటే తాను ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఇక రవిబాబుతో పాటు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన నేహా చౌహాన్ తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ఇక ‘హుషారు’ ఫేం ప్రియా వడ్లమాని పాత్ర బాగుంది. తన ఎమోషన్ సినిమాకి కొంతవరకూ హెల్ప్ అయ్యింది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక విభాగం విషయానికి వస్తే హర్రర్ సినిమాలకు మెయిన్ కావాల్సింది కెమెరా పనితనం. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్వాలేదు.

ఓవరాల్ గా హర్రర్‌ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here