కోలీవుడ్ స్టార్ విశాల్, సీనియర్ డైరెక్టర్ సి.సుందర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘యాక్షన్’. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ట్రిడెంట్ ఆర్ట్స్ పతాకంపై ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్నాడు.ఇస్మార్ట్ శంకర్, గద్దలకొండ గణేష్, హుషారు, రాజుగారి గది 3 వంటి సూపర్‌హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన శ్రీనివాస్ ఆదెపు నిర్మాతగా మారి శ్రీకార్తికేయ సినిమాస్ పతాకంపై ’యాక్షన్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా తమిళ్ ట్రయిలర్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ రోజు తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. పూరీ జగన్నాథ్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విశాల్, తమన్నా అండర్ కవర్ కాప్స్‌గా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్‌లోనే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి… ఇప్పటికే ప్రచార చిత్రాలతో ఆసక్తి రేకెత్తిస్తున్న `యాక్షన్`… థియేటర్లలో ఏ మేరకు అలరిస్తుందో తెలియాలంటే సినిమా వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: