కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 3

Salman khan Musical Blockbuster Maine Pyar Kiya Completes 30 Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Salman khan Latest News,Maine Pyar Kiya Movie Updates,Maine Pyar Kiya Telugu Movie Latest News
సినిమా వార్తలు

సల్మాన్ ఖాన్ మ్యూజికల్ సెన్సేషన్ 'మైనే ప్యార్ కియా'కి 30 ఏళ్లు

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కెరీర్ లో ప్రత్యేకం గా నిలిచిన చిత్రం 'మైనే ప్యార్ కియా'. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో భాగ్యశ్రీ కథానాయకిగా నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి పెట్టింది పేరైన ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా సూరజ్ ఆర్ బర్జత్య దర్శకుడిగా తొలి అడుగు వేశాడు. రామ్ లక్ష్మణ్ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ అప్పట్లో విశేష ఆదరణ పొందాయి.

Team TFNవాట్సాప్
Ram Charan To Team Up With Director Harish Shankar For A New Movie
సినిమా వార్తలు

రామ్ చరణ్ తో హరీష్ శంకర్?

' సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' (సాయి తేజ్), 'దువ్వాడ జగన్నాథమ్' (అల్లు అర్జున్), 'గద్దల కొండ గణేష్' (వరుణ్ తేజ్)... ఇలా వరుసగా మెగా కాంపౌండ్ హీరోలతోనే సినిమాలు చేస్తున్న టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్... తన నెక్ట్స్ ప్రాజెక్టు ను కూడా అదే ఫ్యామిలీ హీరోతో చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
సాంగ్

'సరిలేరు నీకెవ్వరు' పార్టీ సాంగ్ ప్రోమో రిలీజ్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రోజుకో సర్‌ప్రైజ్‌ను విడుదల చూస్తూ ప్రేక్షకులను, అభిమానులను థ్రిల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పాటలు, టీజర్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వాలి..!

వరుస పరాజయాల తర్వాత సుశాంత్ ఇటీవలే 'చి.ల.సౌ' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీనితో తన తర్వాత సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఒక సినిమాను లైన్ లో పెట్టాడు. దీనికి సంభందించిన టైటిల్ ను కూడా రీసెంట్ గానే రిలీజ్ చేసాడు. "ఇచ్చట వాహనములు నిలుపరాదు.. NO PARKING" అనే ట్యాగ్ లైన్ తో వున్న ఈ టైటిలే చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది.

TFN Adminవాట్సాప్
సాంగ్

'దర్బార్' మూడో పాట విడుదల

మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసింది. ఈ నేపథ్యంలోనే 'ధుమ్మూ ధూళీ', 'డుమ్ డుమ్' అనే రెండు పాటలను రిలీజ్ చేయగా రెండు సాంగ్స్ విశేష ఆదరణ దక్కించుకున్నాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. 2020, జనవరి 3న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ వేడుక నిర్వహిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
RGV New Web Series Details,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Ram Gopal Varma New Web Series,Director Ram Gopal Varma New Web Series Details
సినిమా వార్తలు

కొత్త వెబ్ సిరీస్ - 'ముంబై అండర్ వరల్డ్' ఆధారంగా

మొత్తానికి రామ్ గోపాల్ వర్మ ఒక పక్క సినిమాలు, మరో పక్క వెబ్ సిరీస్ లు అంటూ ఒకదాని తర్వాత ఒకటి చేసినా చేయకపోయినా అప్ డేట్స్ మాత్రం ఇస్తున్నాడు. ఒక సినిమా పేరు ప్రకటించేలోపే మరో సినిమాను విడుదల చేస్తుంటాడు. ఇప్పటికే 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' లు సినిమాతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు... రాజకీయ నాయకులపై పొలిటికల్ పంచ్ గా ఈ సినిమాను తీసి రిలీజ్ చేశాడు. ఇంకా 'బ్యూటిఫుల్', 'ఎంటర్ ది గర్ల్ డ్రాగన్' అనే సినిమాలు లైన్ లో ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాలు రెండూ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

TFN Adminవాట్సాప్
సాంగ్

దిల్ రాజు, లగడపాటి శ్రీధర్ వారసుల "రౌడీ బాయ్స్ "

టాలీవుడ్ లో హీరో , దర్శకుల వారసులు హీరోలుగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు నిర్మాతల వారసులు హీరోలుగా టాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ టాలీవుడ్ లో స్టార్ హీరో గా మారిన విషయం తెలిసిందే. నిర్మాత రామానాయుడు తనయుడు వెంకటేష్, బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సక్సెస్ ఫుల్ హీరోలుగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. ఇప్పుడు ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, లగడపాటి వారసులు టాలీవుడ్ కు హీరోలుగా పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'ఆల్ ది బెస్ట్' నితిన్, రష్మిక

‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే...మరోపక్క డబ్బింగ్ ను కూడా స్టార్ట్ చేసేసారు. ప్రస్తుతం పాటల చిత్రీకరణ కోసం రోమ్ వెళ్ళింది చిత్రయూనిట్. ఈ పాటల షూటింగ్ పూర్తయితే సినిమా షూటింగ్ పూర్తయినట్టే. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నిన్ననే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సింగిల్స్ ఆంథమ్ ఈ పాటను రిలీజ్ చేసారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కొత్త సంవత్సరంలో బిజీ బిజీ గా రష్మిక

బ్లాక్ బస్టర్ "ఛలో " మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించి తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక " గీత గోవిందం "మూవీ ఘనవిజయంతో స్టార్ హీరోయిన్ గా మారి పలు అవకాశాలను అందుకున్నారు. ఒక వైపు యంగ్ హీరోలతో నటిస్తూనే, మరో వైపు స్టార్ హీరోలతో నటిస్తూ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారారు. కన్నడ మూవీస్ లో కూడా నటిస్తున్న రష్మిక కోలీవుడ్ లో కార్తీ హీరోగా రూపొందుతున్న తమిళ మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తానే నిర్మాతగా హారర్ థ్రిల్లర్ లో సామ్..?

పెళ్ళైన తర్వాత సమంత వైవిధ్యమైన కథలతో.. వరుస హిట్లతో .. వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ఈ యేడాది మొదట్లో నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా, రీసెంట్‌గా ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి. సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ సినిమా '96' రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది. వీటితో పాటు ఈమె `ది ఫ్యామిలీ మ్యాన్‌` వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

యాక్టర్ గా మారిన స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్

దర్శకులు నటులుగా మారిన పలు సందర్భాలు ఉన్నాయి. తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు తన మూవీస్ లో చిన్న పాత్రలలో నటించడం అలవాటు. ఇప్పుడు ఒక మూవీ లో ఫుల్ లెంగ్త్ రోల్ లో నటిస్తున్నారు. ఘర్షణ , ఏ మాయ చేసావె, ఎటో వెళ్లి పోయింది మనసు, సాహసం శ్వాసగా సాగిపో మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు గౌతమ్ మీనన్ పరిచయమే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో బెస్ట్ మూవీ" RRR"- శ్రీ సింహా

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా మల్టీ స్టారర్ " RRR" మూవీ శరవేగంగా రూపొందుతుంది. ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా కథానాయికలు. అజయ్ దేవగన్, సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

రియల్ లొకేషన్స్ లో 'కపటధారి' షూటింగ్

ఇటీవల సుబ్రహ్మణ్యపురం సినిమాతో ప్రేక్షకులను అలరించిన సుమంత్ ఇప్పుడు మరో డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో కొత్త సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ట‌యిన `కవలుదారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకుంటుంది. హైదరాబాద్ లోని రియల్ సన్నివేశాల్లో ఈ షూటింగ్ జరుగుతున్నట్టు తెలుపుతున్నారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రష్యా , యూరోప్ లలో "కోబ్రా "

సెవెన్ స్క్రీన్స్ స్టూడియోస్ బ్యానర్ పై సూపర్ హిట్ మూవీ "ఇమైక్క నోడిగళ్ " దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం లో చియాన్ విక్రమ్ హీరోగా "కోబ్రా "తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "KGF " మూవీ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయిక. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, KS రవికుమార్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లెజెండరీ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రిటైర్డ్ పోలీస్ అధికారి ట్రైనింగ్ లో రానా దగ్గుబాటి

సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మాణ సారథ్యంలో సక్సెస్ ఫుల్ మూవీ "నీదీ నాదీ ఒకే కథ "దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా 1990 ల కాలం నాటి సామాజిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో "విరాటపర్వం 1992"మూవీ రూపొందుతుంది. ప్రియమణి, నందితా దాస్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మరోసారి హ్యాట్రిక్ కాంబినేషన్

తమిళ్ స్టార్ హీరో విజయ్‌, టాలెంటెడ్ దర్శకుడు మురుగదాస్‌ కాంబినేషన్‌ లో సినిమా అంటే హిట్ అన్నట్టే అని ముందే ఫిక్స్ అయిపోతాం. వారిద్దరి కాంబినేషన్ అలాంటిది మరి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘తుపాకీ’, ‘కత్తి’, ‘సర్కార్‌’ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. హ్యాట్రిక్‌ విజయాలను సొంతం చేసుకున్నారు వీరిద్దరూ.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మహానటి సావిత్రి కి అవార్డ్ అంకితం - కీర్తి సురేష్

వైజయంతి మూవీస్ , స్వప్న సినిమా బ్యానర్స్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ "మహానటి "ఘనవిజయం సాధించింది. మహానటి సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించిన కీర్తి సురేష్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అందుకొన్న విషయం తెలిసిందే

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఫ్లాష్ బ్యాక్ 2019... కెరీర్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్స్ చూసిన క‌థానాయ‌కులు

2019 క్యాలెండ‌ర్ ఇయ‌ర్... పలువురు కథానాయకులకు కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్స్ ను అందించింది. మెగాస్టార్ చిరంజీవి నుంచి రైజింగ్ స్టార్ అడివి శేష్ వ‌ర‌కు ప‌లువురు ఈ జాబితాలో ఉన్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

స్పెష‌ల్ డేకి `చిరు 152`

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వంలో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో దేవాదాయ ధ‌ర్మాదాయ శాఖ ఉద్యోగిగా క‌నిపించ‌నున్నారు చిరు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ బాణీల‌ను అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్

షేర్