వరుస పరాజయాల తర్వాత సుశాంత్ ఇటీవలే ‘చి.ల.సౌ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీనితో తన తర్వాత సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఒక సినిమాను లైన్ లో పెట్టాడు. దీనికి సంభందించిన టైటిల్ ను కూడా రీసెంట్ గానే రిలీజ్ చేసాడు. “ఇచ్చట వాహనములు నిలుపరాదు.. NO PARKING” అనే ట్యాగ్ లైన్ తో వున్న ఈ టైటిలే చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అల వైకుంఠపురములో సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసాడు సుశాంత్. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది…’అల వైకుంఠపురం’, ‘సరిలేరు నీకెవ్వరు’ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేశాడు. మరి సుశాంత్ కోరినట్టు రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొడితే అంత కన్నా లేనిదేముంది.
I really enjoy watching @urstrulyMahesh sir films too!
I hope both movies become blockbusters this Sankranthi 💥💥#SarileruNeekevvaru#AlaVaikunthapurramuLoo https://t.co/bjnJtyfIHV— Sushanth A (@iamSushanthA) December 28, 2019




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























