కొత్త సంవత్సరంలో బిజీ బిజీ గా రష్మిక

2020 Turns Out To Be A Busy Year For Rashmika Mandanna

బ్లాక్ బస్టర్ “ఛలో ” మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించి తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక ” గీత గోవిందం “మూవీ ఘనవిజయంతో స్టార్ హీరోయిన్ గా మారి పలు అవకాశాలను అందుకున్నారు. ఒక వైపు యంగ్ హీరోలతో నటిస్తూనే, మరో వైపు స్టార్ హీరోలతో నటిస్తూ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారారు. కన్నడ మూవీస్ లో కూడా నటిస్తున్న రష్మిక కోలీవుడ్ లో కార్తీ హీరోగా రూపొందుతున్న తమిళ మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనిల్ రావిపూడి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు తో జంటగా రష్మిక నటించిన “సరిలేరు నీకెవ్వరు ” మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. 10 రోజులపాటు రష్మిక ఆ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో హీరో నితిన్ కు జోడీ గా రష్మిక నటించిన “భీష్మ ” మూవీ ఫిబ్రవరి 21 తేదీ రిలీజ్ కానుంది. ఆ మూవీ ప్రమోషన్స్ లో రష్మిక పాల్గొనాలి. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న మూవీ లో రష్మిక హీరోయిన్ గా ఎంపిక అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఆ మూవీ షూటింగ్ లో ఫిబ్రవరి లో రష్మిక జాయిన్ కావాలి. ఇలా హీరోయిన్ రష్మిక 2020 సమ్మర్ వరకు బిజీబిజీగా ఉంటారు. పలు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 7 =