తమిళ్ స్టార్ హీరో విజయ్, టాలెంటెడ్ దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా అంటే హిట్ అన్నట్టే అని ముందే ఫిక్స్ అయిపోతాం. వారిద్దరి కాంబినేషన్ అలాంటిది మరి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘తుపాకీ’, ‘కత్తి’, ‘సర్కార్’ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నారు వీరిద్దరూ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా మరో సారి అదే కాంబినేషన్ రిపీట్ కాబోతుందన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మురుగదాస్ ‘దర్బార్’ సినిమాలో పనిలో బిజీగా వున్నాడు. ఇక విజయ్ యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాల తరువాత విజయ్, మురగదాస్ కంబినేషనలో మరో తెరకెక్కనున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే వెట్రిమారన్, మోహన్‌రాజా తదితర దర్శకుల పేర్లు వినిపిస్తున్నా.. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయట. మరి చూద్దాం మరోసారి ఇందులో ఎంత నిజముందో…
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























