మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగిగా కనిపించనున్నారు చిరు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలను అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 14న రిలీజ్ చేయబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం… మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న `చిరు 152`ని రిలీజ్ చేయాలని చెర్రీ భావిస్తున్నాడని తెలిసింది. త్వరలోనే విడుదల తేదిపై క్లారిటీ వస్తుంది.
`చంటబ్బాయ్` (1986) తరువాత చిరు బర్త్ డేకి వస్తున్న మెగాస్టార్ సినిమా ఇదే కావడం విశేషం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























