ఫ్లాష్ బ్యాక్ 2019… కెరీర్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్స్ చూసిన క‌థానాయ‌కులు

These Tollywood Stars Make Career Highest Grossers In 2019

2019 క్యాలెండ‌ర్ ఇయ‌ర్… పలువురు కథానాయకులకు కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్స్ ను అందించింది. మెగాస్టార్ చిరంజీవి నుంచి రైజింగ్ స్టార్ అడివి శేష్ వ‌ర‌కు ప‌లువురు ఈ జాబితాలో ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా నటించాలన్న తన చిరకాల కలని ‘సైరా నరసింహారెడ్డి’తో నెరవేర్చుకున్నారు చిరంజీవి. అంతేకాదు.. పాన్ – ఇండియా మూవీగా రిలీజైన ఈ సినిమాతో కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ ని చూశారాయ‌న‌. ఇక ‘మహర్షి’తో పాతిక చిత్రాల కథానాయకుడు అనిపించుకోవడమే కాకుండా…. కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ అందుకున్నాడు సూప‌ర్ స్టార్ మహేష్ బాబు.

ఇకపోతే, వారికంటే ముందే అంటే సంక్రాంతికి మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’తో అటు విక్ట‌రీ వెంక‌టేష్, ఇటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్… ఇద్దరు కూడా కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ చూశారు. అలాగే ‘ఇస్మార్ట్ శంకర్’తో బౌన్స్ బ్యాక్ కావడమే కాకుండా… కెరీర్ బెస్ట్ గ్రాసర్ ని తన ఖాతాలో జమ చేసుకున్నాడు ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్. అలాగే ‘మజిలీ’తో సోలో హీరోగా నాగ‌చైత‌న్య‌ కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ ను చూస్తే… థ్రిల్లింగ్ మూవీ ‘ఎవరు’తో అడివి శేష్ కూడా అదే బాట పట్టాడు. మరి… వచ్చే ఏడాది ఈ జాబితాలో ఎవ‌రెవ‌రు చేరుతారో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 10 =