రియల్ లొకేషన్స్ లో ‘కపటధారి’ షూటింగ్

Sumanth Kapatadhaari Movie Shoot Happening In Real Locations

ఇటీవల సుబ్రహ్మణ్యపురం సినిమాతో ప్రేక్షకులను అలరించిన సుమంత్ ఇప్పుడు మరో డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో కొత్త సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ట‌యిన `కవలుదారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకుంటుంది. హైదరాబాద్ లోని రియల్ సన్నివేశాల్లో ఈ షూటింగ్ జరుగుతున్నట్టు తెలుపుతున్నారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై డా.ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా… నాజ‌ర్‌, నందిత‌, పూజా కుమార్‌, వెన్నెల కిషోర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంప‌త్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త‌మిళ వెర్ష‌న్‌లో ఇత‌ర న‌టీన‌టులు న‌టిస్తున్నారు. ఇటీవ‌ల విడులైన విజ‌య‌వంత‌మై అర్జున్‌, విజ‌య్ ఆంటోని `కిల్ల‌ర్‌`చిత్రంతో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మంచి పేరు సంపాదించుకున్న‌సైమ‌న్ కె.కింగ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

ఈ సినిమా కాక సంతోష్ కుమార్ సుమంత్ మరో సినిమాను లైన్లో పెట్టినట్టు తెలుస్తుంది. నితిన్, నాని, నిఖిల్ తదితర హీరోలతో పలు హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు తన మిత్రుడు పి.జగన్ మోహన్ రావుతో కలిసి నిర్మించనున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో సుమంత్ ను కొత్త కోణంలో, సరికొత్త గెటప్ లో చూపించనున్నారట.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.