తానే నిర్మాతగా హారర్ థ్రిల్లర్ లో సామ్..?

Latest Telugu Movies News, Samantha Latest News, Samantha New Movie News, Samantha Next Film News, Samantha To Producer And Act In A Movie?, Samantha Upcoming Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates

పెళ్ళైన తర్వాత సమంత వైవిధ్యమైన కథలతో.. వరుస హిట్లతో .. వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ఈ యేడాది మొదట్లో నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా, రీసెంట్‌గా ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి. సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ సినిమా ’96’ రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది. వీటితో పాటు ఈమె `ది ఫ్యామిలీ మ్యాన్‌` వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలాగ ఉండగా తాజా స‌మాచారం మేర‌కు స‌మంత ఓ ద్విభాషా చిత్రంలో చేయనున్నట్టు తెలుస్తుంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందే ఓ హారర్ థ్రిల్లర్ లో నటించడానికి సమంత ఓకే చెప్పినట్టు సమాచారం. ఇది వ‌ర‌కు న‌య‌న‌తార‌తో మ‌యూరి, తాప్సీతో గేమ్ ఓవ‌ర్ సినిమాలు చేయడంతో.. సమంతతో ఏ రకమైన సినిమాను తెస్తాడా అని ఆసక్తికరంగా చూస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, త‌మిళ భాష‌ల్లో కూడా విడుద‌ల చేయనున్నట్టువార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా తెలుగు వెర్షన్ కి ఆమె నిర్మాతగా కూడా వ్యవహరిస్తుందట. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 20 =