‘దర్బార్’ మూడో పాట విడుదల

మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసింది. ఈ నేపథ్యంలోనే ‘ధుమ్మూ ధూళీ’, ‘డుమ్ డుమ్’ అనే రెండు పాటలను రిలీజ్ చేయగా రెండు సాంగ్స్ విశేష ఆదరణ దక్కించుకున్నాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. 2020, జనవరి 3న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ వేడుక నిర్వహిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా మూడో పాటను రిలీజ్ చేశారు. ‘నిఖార్సైన బ్రహ్మచారిని’ అంటూ వచ్చే ఈ పాటకు భాస్కర భట్ల సాహిత్యం అందించగా.. ఇన్నో గెంగా ఈ పాటను పాడారు.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌తో పాటు చెన్నై భామ నివేదా థామ‌స్ , మ‌ల‌యాళ న‌టుడు చెంబన్ వినోద్ జోస్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. దర్బార్ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను NV ప్రసాద్, UV వంశీ తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ జనవరి 9న విడుదలకానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.