కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 2

సినిమా వార్తలు

సైన్స్ ఫిక్షన్ మూవీ లో నిత్యా మీనన్

బ్లాక్ బస్టర్ "అలా మొదలైంది " మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన నిత్యా మీనన్ , ఆ మూవీ లో అద్భుతంగా నటించి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డ్ అందుకొన్నారు. నిత్యా మీనన్ నటించిన ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, S/O సత్యమూర్తి, రుద్రమ దేవి, జనతా గ్యారేజ్ , గీత గోవిందం మూవీస్ ఘనవిజయం సాధించాయి. తమిళ, మలయాళ భాషల చిత్రాలలో బిజీగా ఉన్న ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యా మీనన్ ఇప్పుడు ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
This Hero Graces As Chief Guest For Sarileru Neekevvaru Special Event
సినిమా వార్తలు

"సరిలేరు నీకెవ్వరు " మూవీ స్పెషల్ ఈవెంట్ ముఖ్య అతిథి ?

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్, జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు " మూవీ జనవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించిన ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని , మూవీ పై అంచనాలు పెంచాయి.

Team TFNవాట్సాప్
Hero Kartikeya Teams Up With Lavanya Tripathi
సినిమా వార్తలు

హీరో కార్తికేయ కు జోడీ గా లావణ్య త్రిపాఠి ?

బ్లాక్ బస్టర్ RX 100 మూవీ తో యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న హీరో కార్తికేయ నటించిన కొన్ని సినిమాలు నిరాశ పరిచినా కొత్త మూవీ ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. హీరో గానే కాకుండా ప్రతినాయకుడిగా కూడా కార్తికేయ నటిస్తున్నారు. ఒక నూతన దర్శకుడు రూపొందించనున్న మూవీ కి కార్తికేయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
These Stars Bounced Back In 2019
సినిమా వార్తలు

రివైండ్ 2019... `బౌన్స్ బ్యాక్` అయిన ప్ర‌ముఖులు

ఈ క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు... చాలా కాలం త‌రువాత మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చేశారు. త‌మ‌ బౌన్స్ బ్యాక్ తో అభిమానుల్లోనూ జోష్ పెంచారు.

Team TFNవాట్సాప్
Prati Roju Pandaage Movie Makes Record Collections
బాక్సాఫీస్

"ప్రతి రోజూ పండగే " మూవీ రికార్డ్ కలెక్షన్స్

యూత్ ఫుల్ మూవీస్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా రూపొందిన "ప్రతి రోజూ పండగే " మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సత్యరాజ్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. భారీ అంచనాలతో రిలీజ్ అయిన "ప్రతి రోజూ పండగే " మూవీ అంచనాలకు చేరుకొంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సమ్మర్ రేస్ లో జూనియర్ తేజ్ 'ఉప్పెన'

సాయి తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఇక సినిమా రిలీజ్ డేట్ పై ఇటీవల చిత్ర యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ లో సమ్మర్ హాలిడేస్ కి సినిమాని రిలీజ్ చేయాలనీ సుకుమార్ టీమ్ డిసైడ్ చేసిందట.

TFN Adminవాట్సాప్
Hit Movie First Glimpse Out Tomorrow
ట్రైలర్ & టీజర్

'హిట్' నుండి త్వరలో ఫస్ట్ గ్లింప్స్

మొదటి సినిమాతోనే అటు డైరెక్టర్ గా, నిర్మాతగా, హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు `ఫ‌ల‌క్‌నుమాదాస్` ఫేమ్‌ విశ్వ‌క్‌సేన్. ఇక ఇప్పుడు హీరోగా మరో సినిమాతో వస్తున్నాడు. వాల్‌పోస్ట‌ర్ సినిమా అనే బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసి తొలి ప్ర‌య‌త్నంలోనే `అ!` వంటి డిఫ‌రెంట్ మూవీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించి నిర్మాత‌గా స‌క్సెస్‌ను సాధించాడు నాని. ఇప్పుడు నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్‌పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై విశ్వ‌క్‌సేన్ హీరోగా 'హిట్' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సూప‌ర్‌డెంట్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కన్నడలో హిట్ కొట్టిన 'రక్షిత్' మరి తెలుగులో..?

సచిన్ దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా 'అతడే శ్రీమన్నారాయణ' అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. కన్నడలో 'అవనే శ్రీమన్ నారాయణ' పేరుతో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా అక్కడ ఈ రోజు రిలీజ్ అయింది. అక్కడ రిలీజ్ అయిన ఈ సినిమా మంచి రివ్యూలను సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. అన్ని చోట్ల నుండి పాజిటివ్ రివ్యూలను ఇచ్చాయి. ఈ సినిమాలో రక్షిత్ షెట్టి నటనకు కూడా క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కాయి. అంతేకాదు ఇంగ్లీష్ మీడియా వర్గాలు సైతం రక్షిత్ ను ప్రశంసించాయి.

TFN Adminవాట్సాప్
Interesting Facts About Megastar Chiranjeevi Revealed
సినిమా వార్తలు

ఆ రోజు చిరంజీవిలో కాన్ఫిడెన్స్ నింపింది వీరయ్య అనే కానిస్టేబులట!

నాలుగు దశాబ్దాల అనితరసాధ్యమైన సినీ ప్రస్థానంలో మెగాస్టార్ చిరంజీవి సాధించిన విజయాల గురించి, చేరుకున్న శిఖరాగ్రల గురించి అందరికీ తెలుసు. వర్ధమాన నటుడి స్థాయి నుండి మెగాస్టార్ దాకా సాగిన సుదీర్ఘ ప్రస్థానంలోని పరిణామక్రమమంతా తెరిచిన పుస్తకమే. ఎవరి అండ దండలు లేకుండా ఒక్కడిగా, ఒంటరిగా మద్రాసు సినీ జనారణ్యంలో కాలుమోపిన కొణిదెల శివశంకర వరప్రసాద్ తెలుగు చిత్ర పరిశ్రమలో సెకండ్ జనరేషన్ లీడింగ్ స్టార్ గా ఎదుగుతారని ఎవరూ ఊహించలేదు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రివైండ్ 2019.. బయోపిక్ స్పెషల్

చరిత్రలో ఒక్కో సంవత్సరం ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అలాగే 2019 కూడా ఒక అరుదైన విషయంలో ఒక ప్రత్యేకతను నమోదు చేసుకుంది. గతంలో ఎప్పుడో ఒకటీ అరా అన్నట్లుగా వచ్చేవి నిజ జీవిత చరిత్రల ఆధారంగా నిర్మితమయ్యే బయోపిక్స్. కానీ ఈ సంవత్సరం బయోపిక్ చిత్రాల నిర్మాణం అత్యధికంగా జరగటంతో ' 2019 - ద ఇయర్ ఆఫ్ బయోపిక్స్ ' గా చరిత్రలో నిలిచిపోయింది. జయాపజయాల సంగతి పక్కన పెడితే ఈ సంవత్సరం విడుదలైనన్ని బయోపిక్స్ గతంలో ఎప్పుడు విడుదల కాలేదు.. ఇక ముందు కాకపోవచ్చు కూడా. ఒక భాషలో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధికంగా 7 బయోపిక్స్ విడుదల కావటం ఒక రికార్డుగా చెప్పుకోవాలి. ఆ వివరాల్లోకి వెళితే...

Team TFNవాట్సాప్
Prabhas Graces As A Chief Guest For Nishabdham Movie Promotional Event
సినిమా వార్తలు

"నిశ్శబ్ధం" మూవీ ప్రమోషనల్ ఈవెంట్ కు ముఖ్య అతిథి ప్రభాస్ ?

బ్లాక్ బస్టర్ "భాగమతి " మూవీ తరువాత స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో, హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ "నిశ్శబ్ధం" మూవీ జనవరి 31 వ తేదీ రిలీజ్ కానుంది. సియోటెల్ లో పూర్తిగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ లో మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్, సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Top Heroes Home Banner Movies Released In Tollywood 2019,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Top Heroes Home Banner Movies Released In Telugu Films,Top Heroes Home Banner Movies Released In Telugu
సినిమా వార్తలు

2019లో ఇంటి భోజనం చేసిన ఆ నలుగురు టాప్ స్టార్స్

ఒక్కోసారి చరిత్రలో ఎవ్వరూ ఊహించని యాదృచ్చిక విశేషాలు చోటుచేసుకుంటాయి. వాటి గురించి చదివినప్పుడు ఇది నిజమేనే... తమాషాగా బాగుందే అనిపిస్తుంది. అలాంటిదే 2019లో మన సీనియర్ స్టార్స్ నలుగురు విషయంలో జరిగింది. సాధారణంగా స్టార్ హీరోలు సొంత బ్యానర్లో సినిమాలు చేయటం కొత్తేమీ కాదు. టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్- ఈ నలుగురికి సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి.నలుగురూ గతంలో డిఫరెంట్ బ్యానర్స్ పై సొంత చిత్రాలలో నటించిన వారే . అయితే ఈ అగ్రహీరోలు నలుగురు ఒకే క్యాలెండర్ ఇయర్లో తమ హోమ్ బ్యానర్స్ లో నటించటం 2019లో జరిగిన ఒక యాదృచ్చిక విశేషం. రిలీజ్ ఆర్డర్ ప్రకారం ఆ వివరాల్లోకి వెళితే ...

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ముంబై బ్యాక్ డ్రాప్ లో "ఫైటర్ "

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో యాక్షన్ థ్రిల్లర్ "ఫైటర్" మూవీ షూటింగ్ జనవరి లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ ప్రాజెక్ట్ లో మరో నిర్మాతగా జాయిన్ కావడంతో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందనుంది. ఈ మూవీ లో పలువురు బాలీవుడ్ యాక్టర్స్ నటించనున్నారు. మూవీ షూటింగ్ మేజర్ పార్ట్ ముంబై లోనే జరుగనుందని సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రివైండ్ 2019.. టాలీవుడ్ లో బాలీవుడ్ భామల సందడి

ఈ క్యాలెండర్ ఇయర్లో కొంతమంది బాలీవుడ్ భామలు... తెలుగు చిత్ర పరిశ్రమలో తొలిసారిగా సందడి చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రివైండ్ 2019... హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్

తెలుగునాట ఈ సంవత్సరం పలు ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ సందడి చేశాయి. స్టార్ హీరోయిన్స్ నుంచి రైజింగ్ బ్యూటీస్ వరకు ఈ తరహా చిత్రాల్లో మెరిసారు. వీరిలో ఇప్పటికే ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో నటించిన బ్యూటీస్ తో పాటు ఇప్పటివరకు ఆ తరహా చిత్రాల్లో కనిపించని భామలు కూడా ఉన్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రివైండ్ 2019... రీ - ఎంట్రీ స్పెషల్

తెలుగునాట ఈ ఏడాది పలువురు తారలు రీ ఎంట్రీ ఇచ్చారు. వారిలో కొందరు విజయాలు చూస్తే... మరికొందరు అభినయంతో మెప్పించారు. ఆ వివరాల్లోకి వెళితే...

Team TFNవాట్సాప్
Ala Vaikunthapurramloo Movie Musical Festival Date Locked
సినిమా వార్తలు

"అల .. వైకుంఠ పురములో .." మ్యూజిక్ ఫెస్టివల్ డేట్ ఫిక్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన "అల .. వైకుంఠ పురములో .." మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. టబు, రాజేంద్ర ప్రసాద్, నవదీప్, సుశాంత్, నివేత పేతురాజ్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించారు. గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందిన "అల .. వైకుంఠ పురములో .." మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నెగటివ్ రోల్ లో కమెడియన్ సునీల్

అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో సుహాస్, చాందిని చౌదరి జంటగా కామెడీ ఎంటర్ టైనర్ "కలర్ ఫోటో " మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. 1995 సంవత్సరం నాటి ఒక ఇంజనీరింగ్ కాలేజీ లో జరిగిన ప్రేమకథ ఆధారంగా ఈ మూవీ రూపొందుతుంది. "కలర్ ఫోటో " మూవీలో ఒక కీలక పాత్రకు సునీల్ ఎంపికయ్యారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

షిర్డీ సాయిబాబా సేవలో మహేష్ బాబు

సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు " మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించగా రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న 'అల వైకుంఠపురములో'

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటివరకూ 'సామజవరగమనా', 'రాములో రాములా' 'ఓ మై గాడ్ డాడీ' పాటలు రిలీజ్ చేయగా అభిమానులను అలరిస్తున్నాయి. రీసెంట్ గా బుట్ట బొమ్మ సాంగ్ ను కూడా రిలీజ్ చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో అప్ డేట్ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని... సినిమా రిలీజ్ వరకూ ఈ సినిమానుండి ఎగ్జైటింగ్ అప్ డేట్స్ ఇస్తుంటామని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

TFN Adminవాట్సాప్

షేర్