ఈ ఏడాది క్రిస్మస్ సీజన్ లో ఒకే తేదిన నాలుగు ఆసక్తికరమైన చిత్రాలు బరిలోకి దిగుతున్నాయి. దీంతో… బాక్సాఫీస్ క్లాష్ రసవత్తరంగా మారింది. ఆ తేది డిసెంబర్ 20 కాగా… ఆ చిత్రాలు `రూలర్`, `ప్రతి రోజూ పండగే`, `దొంగ`, `దబంగ్ 3`.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన యాక్షన్ డ్రామా `రూలర్` డిసెంబర్ 20న విడుదల కానుండగా… అదే రోజున సాయితేజ్ హీరోగా నటించిన `ప్రతి రోజూ పండగే` రాబోతోంది. ఇక అదే తేదికి కార్తి తమిళ అనువాద చిత్రం `దొంగ` రిలీజ్ కానుండగా… సల్మాన్ ఖాన్ హిందీ డబ్బింగ్ ఫిల్మ్ `దబంగ్ 3` కూడా డిసెంబర్ 20నే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే… `రూలర్`, `దబంగ్ 3` కాప్ స్టోరీలతో తెరకెక్కితే, `దొంగ` ఓ దొంగోడి కథతో రూపొందింది. అంటే ఒక రకంగా… పోలీస్, దొంగ మధ్య క్లాష్ కూడా ఆ రోజు ఉంటుందనుకోవాలి. ఇక `ప్రతి రోజూ పండగే` విషయానికి వస్తే ఓ ఎన్.ఆర్.ఐ యువకుడి ఎమోషనల్ జర్నీగా ఈ సినిమా సాగుతుంది.
మరి… ఈ నాలుగు చిత్రాలలో వేటికి ప్రజాదరణ దక్కుతుందో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: