‘డియర్ కామ్రేడ్’ సినిమా తర్వాత విజయ్ కథల ఎంపిక విషయంలోకి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ లాంటి రొమాంటిక్ లవ్ స్టోరీ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది. ఇప్పటికే టైటిల్ పోస్టర్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను డిసెంబర్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో `ఫైటర్`, అలాగే ఆనంద్ అన్నామలై డైరెక్షన్‌లో `హీరో` కూడా విజయ్ ఖాతాలో వున్నాయి. దీనితో పాటు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. 2020 వేసవి నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతునట్టు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా తాజాగా విజయ్ మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. యూత్ ను టార్గెట్ చేసుకుని తెరకెక్కించిన చిత్రం ‘హుషారు’ డైరెక్టర్ శ్రీహర్ష కోనుగంటి. ఇటీవలే ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ లైన్ ను విజయ్ కు వినిపించాడట శ్రీహర్ష. ఫారెన్ లో పెరిగిన ఓ ఎన్నారై యువకుడు కొన్ని ప్రత్యేకమైన పరిస్దితుల్లో మారుమూల పల్లెటూరులో బతకాల్సి వస్తోందట. ఆ క్రమంలో హీరో ఎదురుకునే సమస్యలు, సంఘటనలు చుట్టు కథ తిరుగుతుందిట. విజయ్ దేవరకొండ ఈ స్టోరీ లైన్ వినగానే వెంటనే ఓకే చేసేసాడట. పూరీ తో సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమాను చేస్తారట. మరి పూరీ సినిమా తర్వాత విజయ్ శివ నిర్వాణతో చేస్తున్నాడంటున్నారు. మరి చూద్దాం ఫైనల్ గా ఏ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందో.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: