తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటి ఇమేజ్, స్టార్‌డమ్ తెచ్చుకున్న హీరో విజయ్.. ఇటీవల ‘బిగిల్’ (విజిల్) సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం ‘ఖైదీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా నుండి ఇంపార్టెంట్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Team #Thalapathy64 welcomes the super Talented @iam_arjundas on board!#ArjunDasJoinsThalapathy64 pic.twitter.com/VTQdxboQpW
— XB Film Creators (@XBFilmCreators) November 30, 2019
కాగా ఈ సినిమాలో మాళవిక మోహనన్ విజయ్ కు జోడీగా నటిస్తుంది. ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నాడు. మలయాళ నటుడు ఆంటొని, శాంతను కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించనున్నాడు. వచ్చే ఏడాది 2020 వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: