గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ థ్రిల్లర్ ‘ఎన్నై నోక్కి పాయిమ్ తోట్ట’. తెలుగులో ఈ సినిమాను ‘తూటా’ టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. నిజానికి ఈ సినిమాను ఎప్పుడో మొదలుపెట్టారు. సినిమా కూడా ఎప్పుడో పూర్తయింది కాని రిలీజ్ కు మాత్రం నోచుకోలేదు. ఇప్పటికి రెండు మూడుసార్లు విడుదల చివరి క్షణంలో నిలిచిపోయింది. ఈ రోజు కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వాలి కానీ అది కూడా జరగలేదు. డిసెంబర్ లో మరో మంచి డేట్ కోసం చూస్తున్నారట చిత్ర బృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి యూఏ సర్టిఫికెట్ జారీ చేశారు.
కాగా ఈ సినిమాలో మేఘా ఆకాష్ హీరోయినే గా నటిస్తుంది. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ తూటా మూవీ గొలుగూరి రామకృష్ణారెడ్డి సమర్పణలో విజయభేరి వారి బ్యానర్ పై రూపొందించిన ఈ సినిమాకు దర్భుక శివ సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ కు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతోసినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి చూద్దాం ఈ సినిమాతో అయినా మేఘా ఆకాష్ కు హిట్ దక్కుంతుందేమో
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: