శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా ’90ML’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేసింది. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటీకే టీజర్, ట్రయిలర్, పాటలను ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. రేపు సాయంత్రం 6.30 గంటలకు, జూబ్లీహిల్స్ లోని రవి నారాయణరెడ్డి స్టేడియం లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
కాగా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తికేయ సరసన నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తుండగా… రవి కిషన్, రావు రమేష్, అలీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాకు కూడా ‘ఆర్ ఎక్స్100’ సినిమాను నిర్మించిన అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మొదటి సినిమా ‘ఆర్ ఎక్స్ 100’ తో మంచి హిట్ కొట్టిన కార్తికేయ హిప్పితో కాస్త వెనుకపడి గుణ 369 తో మరోసారి ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ సినిమాలోని విలన్ పాత్ర కూడా కార్తికేయకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మరి ఈ సినిమాతో కార్తికేయ మళ్ళీ హిట్ కొడతాడేమో చూద్దాం..!
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: