బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ గా ‘వెంకీమామ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటికీ కాస్త కన్ఫ్యూజన్ వుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు సాంగ్స్ విడుదల చేశారు. రీసెంట్ గా నాగ చైతన్య పుట్టిన రోజున నాగ చైతన్య చేస్తున్న కెప్టెన్ కార్తీక్ రోల్ కి సంబంధించి ఓ వీడియో విడుదల చేయగా ఈ రోజు రాశి ఖన్నా పుట్టిన రోజు సందర్భంగా ‘వెంకీమామ’ టీమ్ ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సినిమా నుంచి తనకు సంబంధించిన ఒక డైలాగ్ వీడియోను విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో వెంకీ సరసన బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: