కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో ‘రెడ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తడం’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ నుఇటీవలే రిలీజ్ చేయగా.. రామ్ లుక్స్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ చిత్రంలో రామ్ రెండు డిఫెరెంట్ లుక్స్‌లో కనిపించనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవలే ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించగా… ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ లో రామ్‌పై మేజర్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నట్టు తెలుస్తుంది. అంతే కాదు రిలీజ్ డేట్ ను కూడా అప్పుడే ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. వచ్చే ఏడాది 2020 ఏప్రిల్ 9 వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
కాగా ఈ సినిమాలో రామ్ కు జోడీగా నివేదా పేతురేజ్, మాళవిక శర్మ హీరోయిన్లు గా నటించనున్నటు వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సినిమాలో నివేదా పేతురేజ్ నటిస్తున్నట్టు పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇక స్రవంతి రవి కోశోర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























