మహానటుడు యన్టీఆర్ స్ట్రయిట్ మూవీస్ తో ఎలాగైతే సెన్సేషన్ క్రియేట్ చేశారో… రీమేక్ చిత్రాలతోనూ అలాగే పలు రికార్డులు సృష్టించారు. అలా… ఆ తారక రాముడు నటించిన సెన్సేషనల్ రీమేక్ మూవీస్ లో `యుగంధర్` ఒకటి. హిందీ చిత్రం `డాన్` (1978) (అమితాబ్ బచ్చన్) ఆధారంగా రూపొందిన ఈ యాక్షన్ డ్రామాలో జయసుధ కథానాయికగా నటించగా… జయమాలిని, సత్యనారాయణ, జగ్గయ్య, ప్రభాకర్ రెడ్డి, కాంతారావు తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు. యాక్షన్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలచిన కె.యస్.ఆర్. దాస్ దర్శకత్వంలో పి.విద్యా సాగర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దిగ్గజ రచయితలు ఆత్రేయ, సి.నారాయణ రెడ్డి, వేటూరి గీత రచనకు… మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా వినసొంపైన బాణీలు అందించారు. `ఓరబ్బీ ఏసుకున్నా కిళ్ళీ`, `నా పరువం` వంటి పాటలు అప్పట్లో ఉర్రూతలూగించాయి. 1979 నవంబర్ 30న విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ `యుగంధర్`… నేటితో 40 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: