భాగమతి మూవీ హిందీ రీమేక్ టైటిల్ “దుర్గావతి”

Hindi Remake Of Bhaagamathie Movie Titled Durgavati,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Bhaagamathie Hindi Remake Title,Durgavati Hindi Film,Bhaagamathie Hindi Remake Updates

జి .అశోక్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన హారర్ థ్రిల్లర్ “భాగమతి ” మూవీ 2018 సంవత్సరం జనవరిలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “భాగమతి ” మూవీ హిందీ లో “దుర్గావతి ” గా రీమేక్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సమర్పణలో అబుడెంటియా ఎంటర్ టైన్ మెంట్స్ , టి .సిరీస్ బ్యానర్స్ పై అశోక్ దర్శకత్వంలో “దుర్గావతి ” మూవీ రూపొందనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“దుర్గావతి ” మూవీ లో భూమి పెడ్నేకర్ అనుష్క పాత్రకు ఎంపిక అయ్యారు. మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. దర్శకుడు అశోక్ ప్రస్తుతం హన్సిక తో ఒక వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ఆ వెబ్ సిరీస్ షూటింగ్ కంప్లీట్ కాగానే “దుర్గావతి ” షూటింగ్ లో పాల్గొంటారు. జనవరిలో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. సందీప్ రెడ్డి వంగ “అర్జునరెడ్డి ” మూవీ ని హిందీలో “కబీర్ సింగ్ ” గా రూపొందించగా రికార్డ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి “జెర్సీ” మూవీ తో, అశోక్ “దుర్గావతి ” మూవీ తో దర్శకులుగా బాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు. ఆల్ ది బెస్ట్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.