థమన్ కు మహేష్, బన్నీ బర్త్ డే విషెస్

Super Star Mahesh Babu and Stylish Star Allu Arjun Sends Out Birthday Wishes To Thaman On Social Media

‘అల వైకుంఠపురములో’ లాంటి ఆడియో ఆల్బమ్ తో ఈ ఏడాదిని స్టార్ట్ చేసాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్. వరుస సూపర్ హిట్ ఆల్బమ్స్ తో దూసుకుపోతున్న థమన్ ను ‘అల వైకుంఠపురములో’ సినిమా మరో మెట్టు ఎక్కించింది. ఈ పాటలు యూ ట్యూబ్ లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో.. ఎన్ని రికార్డ్స్ సాధించాయో చూసాం. ఇక ప్రస్తుతం థమన్ ఒకటి కాదు రెండు కాదు డజను సినిమాలతో సూపర్ బిజీ గా వున్నాడు. ఇక ఈ రోజు థమన్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తమన్నా కు విషెస్ తెలియజేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా థమన్ కు బర్త్ డే విషెస్ తెలియచేసాడు. “నీ మ్యూజిక్‌తో రాక్‌ చెయ్‌. నువ్వు ఎప్పుడూ సంతోషం, ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను.. హ్యాపీ బర్త్‌ డే” అని థమన్ తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు.

 

ఇక బన్నీ `బ్రదర్ థమన్.. ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలి. గత సంవత్సరం లాగానే ప్రతి సంవత్సరం మరపురానిదిగా నిలిచిపోవాలి. నీ సంగీతంతో కొన్ని లక్షల మందిని అలరించాలని కోరుకుంటున్నా` అంటూ థమన్ తో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు.

 

ప్రస్తుతం థమన్ చేతిలో క్రాక్, వకీల్ సాబ్, సోలో బ్రతుకే సో బెటర్, నాని టక్ జగదీష్, వరుణ్ తేజ్ బాక్సర్, సర్కారు వారి పాట ఇంకా చాలా సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. మొత్తానికి కిక్ సినిమాతో తన ప్రయాణాన్నిమొదలు పెట్టిన తమన్ వరుస సినిమాలతో బిజీ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ముందు ముందు కూడా థమన్ ఇలానే చేతినిండా సినిమాలతో బిజీగా ఉండాలని కోరుకుందాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =