మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కరోనా కారణం గా నిలిచిపోయిన “పుష్ప మూవీ షూటింగ్ ముందుగా కేరళ అడవుల్లో చిత్రీకరణకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది . కరోనా కారణంగా హైదరాబాద్ దగ్గరలోని వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరపాలనుకొన్న ప్లాన్ మార్చి ఈస్ట్ గోదావరి రంప చోడవరం , మారేడు మిల్లి అడవులలో చిత్రీకరణ జరపడానికి చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పుష్ప మూవీ ” షూటింగ్ నవంబర్ రెండవ తేదీ నుండి పునః ప్రారంభం కానుంది, రంప చోడవరం , మారేడు మిల్లి అడవులలో నెలరోజుల పాటు జరిగే షూటింగ్ షెడ్యూల్ లో హీరో , హీరోయిన్ లపై సన్నివేశాలతోపాటు కొన్ని యాక్షన్ సీన్స్ కూడా తెరకెక్కించనున్నారు. ఈ మూవీ కై హీరోయిన్ రష్మిక రాయలసీమ స్లాంగ్ భాషను నేర్చుకొనడం విశేషం. “పుష్ప మూవీ ” తెలుగుతో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ ” అల .. వైకుంఠపురములో .. ” మూవీ తరువాత అల్లు అర్జున్ హీరోగా రూపొందే “పుష్ప మూవీ ” పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: