‘పుష్ప’ రెండు షెడ్యూల్స్ పూర్తి

Pushpa Movie Team Successfully Completes Two Schedules,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Pushpa Shoot Update,Pushpa,Pushpa Movie,Pushpa Film,Pushpa Telugu Movie,Pushpa Movie Telugu,Pushpa Movie Latest News,Pushpa Movie Latest Updates,Pushpa Movie Shoot,Pushpa Shoot,Pushpa Movie Shoot Update,Pushpa Telugu Movie Shoot Update,Pushpa Team Completes Two Schedules,Pushpa Movie Shooting,Pushpa Movie Shooting Schedules,Allu Arjun,Allu Arjun Pushpa,Stylish Star Allu Arjun,Allu Arjun Pushpa Shoot Update,Allu Arjun Pushpa Movie News,Pushpa Shoot News

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘పుష్ప’. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్‌ అనే లారీ డ్రైవర్‌ పాత్రలో ఫుల్ మాస్, రఫ్ అండ్ రస్టిక్ లుక్ లో కనిపించనున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ‘పుష్ప’ సినిమాకు సంబంధించి రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేశాం.. ఏజెన్సీ ప్రాంతాలైన మారేడు మిల్లి, రంపచోడవరంలలో చిత్రీకరించాల్సిన షెడ్యూల్స్‌ను పూర్తి చేశాం..అక్కడున్న గిరిజన ప్రజలు, అధికారుల సహకారంతోనే ‘పుష్ప’ సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేశామని ధన్యవాదాలు తెలిపారు. ఇక ఫిబ్రవరి 12 నుంచిమరో షెడ్యూల్ ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.కేరళలో ఈ షెడ్యూల్‌ను చిత్రీకరిస్తారట. ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మందన్న కూడా పాల్గొననున్నట్టు సమాచారం.

ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్‌ గా నివేత పేతురాజ్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది. ఈ ఏడాది ఆగస్టు 13న `పుష్ప` సినిమా విడుదల చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =