మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును, అభిమానులను సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్. ఇక టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ అండ్ క్యూట్ కపుల్స్ లో బన్నీ-స్నేహా రెడ్డి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధంలేని స్నేహా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా.. ఫ్యామిలీ మాత్రం ఎప్పుడు ప్రాధాన్యం ఇస్తూనే వుంటారు. భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి సరదాగా గడుపుతుంటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు స్నేహ రెడ్డి పుట్టిన రోజు కావడంతో ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసాడు బన్నీ. నా లైఫ్ లో స్పెషల్ పర్సన్ అయిన స్నేహ కు హ్యాపీ బర్త్ డే అని.. ముందు ముందు నీతో కలిసి ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు వేడుకల్లో పాల్గొనాలని.. మై క్యూటీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ తెలిపాడు.
అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కించనున్న ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సింది కానీ కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక అందరూ చిన్న చిన్నగా షూటింగ్ లు మొదలు పెడుతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్ననటిస్తుండగా మరో హీరోయిన్ గా నివేత పేతురాజ్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























