‘పుష్ప’లో చెయ్యట్లేదు- క్లారిటీ ఇచ్చిన మాధవన్

Actor Madhavan Gives Clarity That He Is Not A Part Of Allu Arjun Pushpa Movie

అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సింది కానీ కరోనా వల్ల బ్రేక్ పడింది. త్వరలోనే షూటింగ్ ను ప్రారంభించే ప్రయత్నంలో వున్నారు చిత్రయూనిట్. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్న దేవి శ్రీ ప్రసాద్ మాత్రం అప్పుడే సగానికి పైగా ట్యూన్స్ కంపోజ్ చేసినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా గురించి ఇటీవల ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని తీసుకున్నట్టు.. అయితే కొన్ని కారణాల వలన ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు కూడా ప్రకటించారు. ఇక విజయ్ స్థానంలో పలువురు పేర్లు వినిపించాయి. ఇక లేటెస్ట్ గా మాధవన్ ని పుష్ప కోసం తీసుకున్నారని.. నెగిటివ్ పాత్రలో మాధవన్ నటించనున్నారని రూమర్స్ వచ్చాయి. ఇక ఈ వార్తలపై స్పందించిన మాధవన్.. ఈ వార్తలు ఫేక్ అని.. తాను పుష్ప లో ఎలాంటి పాత్రలో నటించట్లేదని తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు.

 

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్ననటిస్తుండగా మరో హీరోయిన్‌ గా నివేత పేతురాజ్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =