‘పుష్ప’ – నవంబర్ మొదటి వారం నుండి షూటింగ్

Stylish Star Allu Arjun Latest Movie Pushpa To Resume Movie Shooting Work In First week of november

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఇప్పటివరకూ ఆర్య, ఆర్య2 రాగా.. ఇప్పుడు మూడోసారి ‘పుష్ప’ సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా.. బన్నీ రస్టిక్ అండ్ రఫ్ లుక్‌లో లారీ డ్రైవర్‌గా కనబడనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం గతంలో విడుదల చేసిన ఫస్ట్ లుక్ ను బట్టి చెప్పొచ్చు. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వాలి కానీ కరోనా వల్ల సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ రాలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇన్ని రోజులు రెస్టింగ్ మోడ్ లో బన్నీ త్వరలోనే యాక్షన్ మోడ్ లోకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. నవంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టనున్నారట. వైజాగ్ లో షూట్ ను స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. ముందుగా యాక్షన్ సీన్లను తెరకెక్కించబోతున్నారట. ఈ పోరాట సన్నివేశాల కోసం హైదరాబాద్‌లో ప్రస్తుతం రిహార్సల్స్ కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్ననటిస్తుండగా మరో హీరోయిన్‌ గా నివేదా పేతురాజ్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది.

కాగా అల్లు అర్జున్ ఈ ఏడాది సంక్రాంతికి ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో వచ్చి భారీ కమర్షియల్ హిట్ ని సాధించాడు. ఈ సినిమాతో తన సత్తా ఏమిటో నిరూపించాడు బన్ని. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన ఈ సినిమా అల్లు అర్జున్ ఇమేజ్ ని భారీగా పెంచేసింది. మరి ఇప్పుడు సుకుమార్ తో కూడా మూడో సినిమాతో వస్తున్నాడు ఈ సినిమాతో బన్నీ మళ్లీ హ్యాట్రిక్ కొడతాడా?లేదా? అన్నది చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 14 =