బన్నీ, రానా కు ‘బ్రహ్మీ’ బహుమతి

Tollywood Ace Comedian Brahmanandam Gives New Year Gifts To Bunny and Rana Daggubati,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rana Daggubati,Actor Rana Daggubati,Hero Rana Daggubati,Allu Arjun,Stylish Star Allu Arjun,Hero Allu Arjun,Actor Allu Arjun,Brahmanandam,Tollywood Ace Comedian Brahmanandam,Lord Venkateshwara Sketch,Brahmanandam Gift To Rana And Allu Arjun,Brahmanandam Hand Drawn Pencil Sketch,Brahmanandam Lord Venkateshwara Pencil Sketch,Brahmanandam Venkateswara Swamy Art,Brahmanandam New Year Gifts Bunny and Rana

నవ్వుల రారాజు బ్రహ్మీ కామెడీ గురించి కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. ఆయన నటన గురించి అందరికీ తెలుసు కానీ చిత్ర కారుడు అన్న విషయం మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. అయితే హాస్య కళతో పాటు బ్రహ్మీలో మరొక కళ కూడా ఉందన్న సంగతి ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం. ఏదో చిత్రాలు వేసాం అన్నట్టు కాదు.. బ్రహ్మీ వేసిన చిత్రాలు చూస్తే ఆయనలో ఎంత ప్రతిభ ఉందో చెప్పొచ్చు. జీవం ఉట్టిపడేలా ఉన్నాయి ఆయన వేసిన చిత్రాలు చూస్తుంటే. చిత్రకళ పట్ల ఆయనకున్న తృష్ణ కనిపిస్తుంది. మొన్నామధ్య అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న సమయంలో బ్రహ్మానందం రాముని వీర భక్తుడు ‘ఆంజనేయుని ఆనంద భాష్పాలు’ పేరుతో చిత్రం గీశారు. ఆ చిత్రం ఎంతో మందిని ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన చిత్రాలు వేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా మరో చిత్ర పటం వేశారు. వేంకటేశ్వరస్వామి చిత్ర పటాన్ని వేశారు. అంతేకాదు ఈ చిత్రాన్ని ఇద్దరు హీరోలు బన్నీ, రానాలకు కొత్త సంవత్సరం కానుకగా బహుకరించారు. ఈ అరుదైన బహుమతికి ట్విట్టర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు బన్నీ, రానా.

కాగా తెలుగు తెరపై దశాబ్దాలుగా నవ్వులు పూయించిన కమెడియన్ ఎవరైనా ఉన్నారంటే అది బ్రహ్మానందం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పేరు వింటే చాలు, చాలామందికి నవ్వు వచ్చేస్తుంది. సినిమాల్లో ఆయన చేసే కామెడీకి కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. ఇప్పుడంటే కొత్త కొత్త కమెడియన్స్ రావడంతో ఆయన హవా కాస్త తగ్గిందేమో కానీ ఒకప్పుడు అయితే ఆయన లేని సినిమా లేదు. ప్రతి ఒక్క సినిమాలో ఆయన ఉండాల్సిందే. ఆయన డేట్స్ లేకపోయినా వెయిట్ చేసి మరీ ఆయన డేట్స్ తీసుకునేవాళ్ళు. అందుకే దాదాపు తక్కువ సమయంలో 1000 చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో సైతం ఈయన పేరు నమోదు చేసుకున్నారు. ఇక చివరిగా ఈయన ‘అల వైకుంఠపురములో’లో కాసేపు కనిపించగా.. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలో ఒక కీలక పాత్రలో చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 10 =