
ట్యాగ్ · 61 కథనాలు


రవితేజ RT76 ఫారిన్ షెడ్యూల్ ప్రారంభం

రవితేజతో మ్యాడ్ డైరెక్టర్ సూపర్ హీరో మూవీ?

షూటింగ్ లో రవితేజకు గాయం

ఆ క్రికెటర్ బయోపిక్ లో నటిస్తా

ధరణితో రావణాసుర సందడి

బలగం పై మాస్ మహారాజా ప్రశంసలు

రావణాసుర పవర్ ఫుల్ రావణ ఆంథమ్ రిలీజ్

టైగర్ నాగేశ్వరరావు టీమ్ కు రేణూ దేశాయ్ థ్యాంక్స్

టైగర్ నాగేశ్వరరావు లో రవితేజ డిఫరెంట్ లుక్స్

రిలీజ్ అయిన రావణాసుర ఫస్ట్ గ్లింప్స్

'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

"ధమాకా "మూవీ నైట్ షూటింగ్ లో రవితేజ

'ఖిలాడి'.. అర్జున్ రోల్ రివీల్..!

'రవితేజ' బర్త్ డే కి ట్రిపుల్ ట్రీట్..!

రెమ్యునరేషన్ లేకుండానే సినిమా చేసిన రవితేజ
మాస్ మహారాజా రవితేజ నుండి రీసెంట్ గా వచ్చిన ఈసినిమాలు అనుకున్న విజయాన్ని అందించలేకపోయాయి.దాంతో అయన తన నెక్స్ట్ సినిమాకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించారు. రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. రిలీజ్ కు రెడీ అవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి వస్తుంది.ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చింది ఇది రవితేజ కు నిజంగా గుడ్ న్యూసే.

సాంగ్ షూట్ లో రవితేజ 76
మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా RT 76 ( వర్కింగ్ టైటిల్) .ఎస్ఎ ల్ వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను బిగ్ కాన్వాస్‌పై స్టైలిష్‌గా రూపొందిస్తున్నారు.సెట్ మీదకు వెళ్ళినప్పటినుండి ఈ సినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది. దాంతో 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఈసినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది. ఈరోజు హీరో రవితేజ, హీరోయిన్ ఆషికా రంగనాథ్ పై మూవీ టీం ఒక పాటను చిత్రీకరిస్తోంది. ఈ పాట కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకమైన సెట్ వేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రూపొందుతున్న ఈ పాట…

రవితేజ RT76 ఫారిన్ షెడ్యూల్ ప్రారంభం
మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో హోల్సమ్ ఎంటర్‌టైనర్ #RT76 చేస్తున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను బిగ్ కాన్వాస్‌పై స్టైలిష్‌గా రూపొందిస్తున్నారు. టీమ్ ప్రస్తుతం కీలక ఫారిన్ షెడ్యూల్‌కి షిఫ్ట్ అయ్యింది. గత కొన్ని రోజులుగా స్పెయిన్‌లోని వాలెన్షియా, సమీప దీవుల్లో లొకేషన్ రెక్కీ పనులు పూర్తి చేశారు.

రవితేజతో మ్యాడ్ డైరెక్టర్ సూపర్ హీరో మూవీ?
రిజల్ట్ తో సంబంధం లేకుండా నాన్ స్టాప్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో మాస్ రాజా రవితేజ ఒకరు.ఏడాదికి కనీసం రెండు సినిమాలు ఫినిష్ చేసేలా చూసుకుంటాడు.ప్రస్తుతం రవితేజ మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు.కొత్త దర్శకుడు భాను భోగవరపు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.రవితేజ కెరీర్ లో 75వ సినిమా గా వస్తుంది.

షూటింగ్ లో రవితేజకు గాయం
మాస్ మహారాజా రవితేజకు ఆర్ టి 75 షూటింగ్ లో గాయమైంది.తన కుడి చేతికి ఇంతకుముందే గాయం ఉండగా అలానే షూటింగ్ లో పాల్గొనడంతో ఆ గాయం కాస్త తీవ్రమైంది.దాంతో నిన్న యశోద హాస్పిటల్ లో గాయానికి విజయవంతంగా శస్త్ర చికిత్స జరిగింది.సర్జరీ పూర్తి కావడంతో 6 వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.దాంతో రవితేజ మరో 42రోజుల వరకు షూటింగ్ కి బ్రేక్ ఇవ్వనున్నాడు.

ఆ క్రికెటర్ బయోపిక్ లో నటిస్తా
ప్రతి ఒక్క హీరోకి, హీరోయిన్ కి తమకు నచ్చిన పాత్రలు కొన్ని ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన పాత్రల్లో నటించాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నప్పుడు.. అలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు తమ ఇంట్రెస్ట్ ను బయటపెడుతుంటారు. ఇక ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ కూడా ఓ క్రికెటర్ బయోపిక్ లో నటిస్తానని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.

ధరణితో రావణాసుర సందడి
ఈమధ్య సినిమాల ప్రమోషన్స్ లో క్రియేటివిటీ చూపిస్తున్నారు మేకర్స్. ఎంత విభిన్నంగా ప్రమోషన్స్ చేస్తే అంత బజ్ క్రియేట్ అవుతుంది. అందుకే మేకర్స్ కొత్త కొత్త ప్రయత్నాలతో వస్తున్నారు. అంతేకాదు ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీలను సైతం వాడేస్తున్నారు. ఈనేపథ్యంలో మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా దసరా కూడా ప్రమోషన్స్ తో బిజీగా గా ఉంది. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ లో నాని, కీర్తి సురేష్, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమా కావడంతో ఆ రేంజ్ లోనే ప్రమోషన్స్ చేస్తున్నారు.

బలగం పై మాస్ మహారాజా ప్రశంసలు
ఒకప్పుడు చిన్న సినిమాలు ఎప్పుడు వచ్చేవో ఎప్పుడు వెళ్లేవో కూడా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు చిన్న సినిమాలకు సైతం మంది ఆదరణ లభిస్తుంది. కథ బాగుంటే పెద్ద పెద్ద నిర్మాతలు సైతం ప్రోత్సహిస్తున్నారు. కాబట్టే ఈమధ్య చాలా చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ ను అందుకోగలుగుతున్నాయి. ఇక చిన్న సినిమాల కోసమే ప్రత్యేకంగా కొత్త బ్యానర్ ను పెట్టి.. మొదటి సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నారు దిల్ రాజు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ ను పెట్టి అందులో మొదటిగా తీసిన సినిమా బలగం. కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ ప్రియదర్శి హీరోగా ఈసినిమా వచ్చింది. కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన…

రావణాసుర పవర్ ఫుల్ రావణ ఆంథమ్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ మంచి స్పీడుమీదున్నాడు. ఒక సినిమాను రిలీజ్ చేసిన వెంటనే మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే రవితేజ ధమాకా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు రావణాసురు అంటూ వచ్చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రజంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్…

టైగర్ నాగేశ్వరరావు టీమ్ కు రేణూ దేశాయ్ థ్యాంక్స్
పూరీ జగన్నాథ్ సినిమా బద్రితో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ రేణూ దేశాయ్. ఆతరువాత పవన్ తోనే మళ్లీ జాని అనే సినిమాలో నటించింది. కేవలం రెండు సినిమాల్లోనే నటించిన రేణు పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నేళ్లు కలిసి ఉన్న వీరు ఆ తరువాత విడిపోయారు. ఇక చాలా ఏళ్లు గ్యాప్ తీసుకోని ఈమధ్యే మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. వంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

టైగర్ నాగేశ్వరరావు లో రవితేజ డిఫరెంట్ లుక్స్
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మిగిలిన సినిమాల పెండింగ్ షూటింగ్ లను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అందులో టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా ఒకటి. వంశీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా కూడా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే ఈసినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చాయి. తాాజాగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈసినిమాలో రవితేజ మూడు డిఫరెంట్ లుక్స్ లలో కనిపించనున్నాడట. స్టైలిష్, రగ్డ్, యంగ్…

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మాస్ మహారాజా రవితేజ
బ్లాక్ బస్టర్ క్రాక్ మూవీ తరువాత రవితేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ మూవీస్ పరాజయం పాలయినా ధమాకా మూవీతో రవితేజ తన క్రేజ్, స్టామినా ను నిరూపించుకున్నారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీలీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరింది.

మాస్ మహారాజా రవితేజకు మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే స్పెషల్ విషెస్
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య మూవీ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. ఆ మూవీలో వారిద్దరూ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. జనవరి 26 వ తేదీ హీరో రవితేజ తన బర్త్ డే ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గా స్టార్ చిరంజీవి రవితేజ కు సోషల్ మీడియా ద్వారా స్పెషల్ విషెస్ తెలిపారు.

రిలీజ్ అయిన రావణాసుర ఫస్ట్ గ్లింప్స్
అభిషేక్ పిక్చర్స్, ఆర్.టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ రావణాసుర మూవీ 2023 ఏప్రిల్ 7 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ, దక్ష నగార్కర్ కథానాయికలు. హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మాస్ మహారాజా రవితేజ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వర రావు
తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై వంశీ దర్శకత్వం లో మాస్ మహారాజా రవితేజ హీరోగా స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నుపుర్ సనన్ కథానాయిక కాగా గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ తో 18 సంవత్సరాల తరువాత రేణు దేశాయ్ టాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తున్నారు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుండి ఫస్ట్ పోస్టర్, రేణు దేశాయ్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
మాస్ మహారాజా రవితేజ మంచి దూకుడుమీదున్నాడు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. యదార్థ సంఘటన ఆధారంగా శరత్ మండవ ఈసినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్, పోస్టర్లు సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేశాయి. రీసెంట్ గానే ఈసినిమా టీజర్ లోడింగ్ అవుతుంది అంటూ డైరెక్టర్ అప్ డేట్ ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా నుండి ఫ్యాన్స్ కు సర్…

"ధమాకా "మూవీ నైట్ షూటింగ్ లో రవితేజ
మాస్ మహారాజా పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రావణాసుర” మూవీ సెప్టెంబర్ 30 న రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ , దక్ష నగార్కర్ కథానాయికలు.వంశీ దర్శకత్వం లో పాన్ ఇండియా మూవీ “టైగర్ నాగేశ్వరరావు ” మూవీ కి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

'ఖిలాడి'.. అర్జున్ రోల్ రివీల్..!
రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఖిలాడి. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమాను ఫిబ్రవరి 11న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా కానీ చెప్పిన డేట్ కే సినిమాను రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే రిలీజ్ కు ఇంకా ఎన్నో రోజులు లేకపోవడంతో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన పలు పోస్టర్లు.. పాటలు రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

'రవితేజ' బర్త్ డే కి ట్రిపుల్ ట్రీట్..!
క్రాక్ సినిమాతో మళ్లీ రవితేజ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. చాలా కాలం సరైన హిట్ కోసం ఎదురుచూసిన రవితేజకు క్రాక్ రూపంలో హిట్ దక్కింది. ఇక ప్రస్తుతం అయితే రవితేజ గతంలో కాకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఈఏడాది రవితేజ నుండి కనీసం రెండు సినిమాలు అయినా వచ్చే అవకాశం ఉంది. ఇక రేపు రవితేజ పుట్టినరోజు కావడంతో తన సినిమాల నుండి ట్రిపుల్ ట్రీట్ రానుంది.

రవితేజ ‘రావణాసుర ప్రారంభం.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్..!
రవితేజ మాత్రం తన స్పీడును అస్సలు తగ్గించట్లేదు. ఒక సినిమా లైన్ లో ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టేస్తున్నాడు. ఇప్పటికే రవితేజ లిస్ట్ లో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అయినా కూడా కొత్త కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ప్రస్తుతం 'ఖిలాడి' చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకోగా 'రామారావు ఆన్ డ్యూటీ' షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాను త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా వంశీ అనే డైరెక్టర్ తో టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.