మాస్ మహారాజా రవితేజకు ఆర్ టి 75 షూటింగ్ లో గాయమైంది.తన కుడి చేతికి ఇంతకుముందే గాయం ఉండగా అలానే షూటింగ్ లో పాల్గొనడంతో ఆ గాయం కాస్త తీవ్రమైంది.దాంతో నిన్న యశోద హాస్పిటల్ లో గాయానికి విజయవంతంగా శస్త్ర చికిత్స జరిగింది.సర్జరీ పూర్తి కావడంతో 6 వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.దాంతో రవితేజ మరో 42రోజుల వరకు షూటింగ్ కి బ్రేక్ ఇవ్వనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓ సినిమా విడుదలకాకముందే మరో సినిమా మొదలుపెట్టే రవితేజకు ఇన్ని రోజులు బ్రేక్ తీసుకోవడం రావడం ఈమధ్య ఇదే మొదటిసారి.ఇక ఈఏడాది రెండు సినిమాలతో వచ్చాడు రవితేజ.అందులోభాగంగా ఫిబ్రవరి లో ఈగల్ విడుదలకాగా కొద్దీ రోజుల క్రితం మిస్టర్ బచ్చన్ తోవచ్చాడు.ఇందులో ఈగల్ పర్వాలేదనిపించగా మిస్టర్ బచ్చన్ నిరాశపరిచింది.దాంతో రవితేజ ఫ్యాన్స్ ఆర్ టి 75 మీద చాలా ఆశలు పెట్టుకున్నారు.
సామజవరగమన ఫేమ్ భాను భోగవరపు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి విడుదలచేస్తామని ప్రకటించారు.అయితే రవితేజ ఇప్పుడు లాంగ్ బ్రేక్ తీసుకోనుండడంతో మరి ఆసమయానికి వస్తుందో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: