ధరణితో రావణాసుర సందడి

nani and raviteja makes something fun

ఈమధ్య సినిమాల ప్రమోషన్స్ లో క్రియేటివిటీ చూపిస్తున్నారు మేకర్స్. ఎంత విభిన్నంగా ప్రమోషన్స్ చేస్తే అంత బజ్ క్రియేట్ అవుతుంది. అందుకే మేకర్స్ కొత్త కొత్త ప్రయత్నాలతో వస్తున్నారు. అంతేకాదు ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీలను సైతం వాడేస్తున్నారు. ఈనేపథ్యంలో మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా దసరా కూడా ప్రమోషన్స్ తో బిజీగా గా ఉంది. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ లో నాని, కీర్తి సురేష్, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమా కావడంతో ఆ రేంజ్ లోనే ప్రమోషన్స్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ప్రమోషన్స్ లో భాగంగా నాని మాస్ మహారాజా రవితేజ తో కలిసి సందడి చేసినట్టు తెలుస్తుంది. నిజానికి రవితేజ రావణాసుర సినిమా కూడా దసరా తరువాత వారం రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఇద్దరూ డిఫరెంట్ గా ఈ ప్లాన్ చేశారు. తాజాగా నాని తన ట్విట్టర్ ద్వారా రవితేజ తో ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ రవితేజతో కలిసి ఫన్ చేసినట్టు తెలిపారు. ఇక ఈ పోస్ట్ పై రవితేజ కూడా స్పందిచి ధరణి, రావణాసుర అంటూ క్యాప్షన్ ఇచ్చారు. మొత్తానికి ఇద్దరూ డబుల్ ప్రమోషన్స్ తో రాబోతున్నారు. చూద్దాం మరి ఇద్దరూ కలిసి ఎంత సందడి చేస్తారో..

కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + thirteen =