అభిషేక్ పిక్చర్స్, ఆర్.టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ రావణాసుర మూవీ 2023 ఏప్రిల్ 7 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ, దక్ష నగార్కర్ కథానాయికలు. హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జనవరి 26న రవితేజ పుట్టిన రోజు సందర్బంగా సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రావణాసుర సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే రవితేజను చాలా ప్రత్యేకంగా చూపించారు. ఈ మూవీలో రవితేజ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. ఆయన లుక్ కూడా డిఫరెంట్ గా కనిపిస్తోంది. హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్ అంటూ విడుదల చేసిన ఆ గ్లింప్స్ వీడియో రవితేజ ఫ్యాన్స్ కు అసలైన బర్త్ డే గిఫ్ట్ మారింది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదే రేంజ్ లో ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో రవితేజ ఈ మూవీతో పాటు టైగర్ నాగేశ్వరరావు మూవీలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: