మాస్ మహారాజా రవితేజ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వర రావు

Tiger Nageswara Rao Movie To be Ravi Teja’s First Pan Indian Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravi Teja,Ravi Teja Latest News,Ravi Teja New Movie News,Ravi Teja Upcoming Movie Updates,Ravi Teja Latest Film Details,Tiger Nageswara Rao,Tiger Nageswara Rao Movie,Tiger Nageswara Rao Telugu Movie,Tiger Nageswara Rao Movie Shooting Updates,Tiger Nageswara Rao Telugu Movie Shooting Latest News

తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై వంశీ దర్శకత్వం లో మాస్ మహారాజా రవితేజ హీరోగా స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నుపుర్ సనన్ కథానాయిక కాగా గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ తో 18 సంవత్సరాల తరువాత రేణు దేశాయ్ టాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తున్నారు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుండి ఫస్ట్ పోస్టర్, రేణు దేశాయ్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా హీరో రవితేజ ఒక ఇంటర్వ్యూలో తన టైగర్ నాగేశ్వరరావు సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రవితేజ మాట్లాడుతూ ..తన ప్రతి సినిమాను కూడా పాన్ ఇండియా సినిమా అనుకోననీ , తన కంటూ పాన్ ఇండియా సినిమా అంటే ఒక అర్థం ఉందనీ , అందుకే ధమాకా ను పాన్ ఇండియా సినిమా అనడానికి లేదనీ , కానీ తాను నటిస్తున్నటైగర్ నాగేశ్వరరావు మాత్రం కచ్చితంగా పాన్ ఇండియా సినిమా అనీ ,టైగర్ నాగేశ్వరరావు సినిమా భారీ బడ్జెట్ తో రూపొందకున్నా, భారీ విజువల్స్ గ్రాండియర్ ఉండకున్నా కూడా పాన్ ఇండియా సినిమాగా చెప్పుకోవచ్చుననీ , కథ మరియు కాన్సెప్ట్ వల్ల టైగర్ నాగేశ్వరరావును పాన్ ఇండియా సినిమాగా తాను భావిస్తాననీ చెప్పారు. రవితేజ మొదటి పాన్ ఇండియా సినిమా గా టైగర్ నాగేశ్వరరావు విడుదల కాబోతుంది. ఈ సినిమా సక్సెస్ అయితే ముందు ముందు ఆయన నుండి వరుసగా పాన్ ఇండియా సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − six =