సాంగ్ షూట్ లో రవితేజ 76

Song Shoot Underway for Ravi Teja 76

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా RT 76 ( వర్కింగ్ టైటిల్) .ఎస్ఎ ల్ వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను బిగ్ కాన్వాస్‌పై స్టైలిష్‌గా రూపొందిస్తున్నారు.సెట్ మీదకు వెళ్ళినప్పటినుండి ఈ సినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది. దాంతో 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఈసినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది. ఈరోజు హీరో రవితేజ, హీరోయిన్ ఆషికా రంగనాథ్ పై మూవీ టీం ఒక పాటను చిత్రీకరిస్తోంది. ఈ పాట కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకమైన సెట్‌ వేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రూపొందుతున్న ఈ పాట అదిరిపోయే డ్యాన్స్ నంబర్‌గా ప్రేక్షకులను అలరించనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎలక్ట్రిక్ ఎనర్జీతో ప్రేక్షకులను అలరించే రవితేజ ఈ సినిమాలో న్యూ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. ఇది హ్యూమర్, ఎమోషన్, రవితేజ మాస్ ఎలిమెంట్స్‌ తో ఫుల్-ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోంది.ఎమోషనల్ కథలతో అలరించే దర్శకుడు కిశోర్ తిరుమల ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకుల ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు.ఈ సినిమాకి సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.సినిమాటోగ్రఫీ ప్రసాద్ మూరెళ్ళ.నేషనల్ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.

ఇక గత వారంలో మాస్ జాతర తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ కు ఆ సినిమా కూడా అనుకున్న విజయాన్ని అందించలేకపోయింది.మరి RT 76 తోనైనా హిట్ కొట్టి రవితేజ ఫామ్ లోకి వస్తాడో చూడాలి.సంక్రాంతికి ఈసినిమా థియేటర్లోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.