రిజల్ట్ తో సంబంధం లేకుండా నాన్ స్టాప్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో మాస్ రాజా రవితేజ ఒకరు.ఏడాదికి కనీసం రెండు సినిమాలు ఫినిష్ చేసేలా చూసుకుంటాడు.ప్రస్తుతం రవితేజ మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు.కొత్త దర్శకుడు భాను భోగవరపు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.రవితేజ కెరీర్ లో 75వ సినిమా గా వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.శ్రీ లీల ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈసినిమా తరువాత రవితేజ నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తన 76వ సినిమా చేయనున్నాడు.సుధాకర్ చెరుకూరి ఈసినిమాను నిర్మించనున్నారని సమాచారం.త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.
ఇక ఈసినిమా తరువాత రవితేజ 76వ సినిమాను మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తో చేయాలని చూస్తున్నాడు.సూపర్ హీరో మూవీ గా రానుంది.ఆల్రెడీ కళ్యాణ్ శంకర్ కథ వినిపించడం కూడా జరిగిపోయింది.రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఒక్కటే బ్యాలెన్స్ వుంది.భారీ బడ్జెట్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ తరువాత ఈసినిమాను లాక్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: