బలగం పై మాస్ మహారాజా ప్రశంసలు

Mass Maharaja Raviteja Praises On Balagam Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Mass Maharaja Ravi Teja,Ravi Teja,Ravi Teja Movies,Ravi Teja New Movie,Ravi Teja Latest News,Ravi Teja About Balagam Movie,Ravi Teja About Balagam,Balagam,Balagam Movie,Balagam Telugu Movie,Balagam Review,Balagam Movie Review,Balagam Telugu Movie Review,Balagam Songs,Balagam Movie Songs,Balagam Movie Updates,Balagam Movie Latest News,Ravi Teja Praises On Balagam Movie,Ravi Teja Praises On Balagam,Priyadarshi,Venu Yeldandi,Mass Maharaja Lauds Balagam Movie

ఒకప్పుడు చిన్న సినిమాలు ఎప్పుడు వచ్చేవో ఎప్పుడు వెళ్లేవో కూడా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు చిన్న సినిమాలకు సైతం మంది ఆదరణ లభిస్తుంది. కథ బాగుంటే పెద్ద పెద్ద నిర్మాతలు సైతం ప్రోత్సహిస్తున్నారు. కాబట్టే ఈమధ్య చాలా చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ ను అందుకోగలుగుతున్నాయి. ఇక చిన్న సినిమాల కోసమే ప్రత్యేకంగా కొత్త బ్యానర్ ను పెట్టి.. మొదటి సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నారు దిల్ రాజు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ ను పెట్టి అందులో మొదటిగా తీసిన సినిమా బలగం. కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ ప్రియదర్శి హీరోగా ఈసినిమా వచ్చింది. కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈసినిమా మార్చి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను చూసిన వారందరూ ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమాపై చిరు ప్రశంసలు కురిపించారు. అంతేకాదు చిత్రయూనిట్ ను చిరు స్వయంగా సన్మానించడం కూడా జరిగింది. తాజాగా మాస్ మహారాజా రవితేజ కూడా ఈసినిమాను చూసి తన ట్విట్టర్ ద్వారా ప్రశంశలు కురిపించారు. వాట్ ఏ ఫిలిం.. ఫ్యామిలీ ఐక్యతను చాలా బాగా చూపించారు. మొదటి సినిమాలోనే డైరెక్టర్ వేణు చాలా బాగా చేశాడు.. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ తో పాటు చిత్రయూనిట్ మొత్తానికి కంగ్రాట్స్. బీమ్స్ సంగీతం ఈసినిమాకు హార్ట్ లాగా నిలిచింది.. ఇక ఇలాంటి కథలకు ఎప్పుడూ బ్యాక్ బోన్ లాగ ఉంటున్న దిల్ రాజు, హర్షితలకు హ్యాట్సాఫ్ అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.

కాగా ఈసినిమాలో కావ్యా కల్యాణ్‌రామ్‌, సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌, జయరాం, విజయలక్ష్మీ, స్వరూప కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు సమర్పణలో దిల్ రాజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈసినిమాకు హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here