ట్యాగ్ · 42 కథనాలు · పేజీ 2
ఆ సినిమాలో నేను లేను.. అందులో నిజం లేదు..!
ఇంట్లో ఉంటే ఇంత బాగుంటుందనుకోలేదు..!
ఆలోచన రేకెత్తించే రష్మిక పోస్ట్

"సహజ సుందరి" రష్మిక
'హ్యాపీ బర్త్ డే' మై కామ్రేడ్..!
"పుష్ప " మూవీ లో రష్మిక స్పెషల్ లుక్
కరోనా పై పోరాటంలో విజయం సాధిస్తాం - రష్మిక
చిత్తూరు యాస భాష ప్రాక్టీస్ లో రష్మిక?

'పుష్ప' సినిమాలో హైలైట్ గా రష్మిక పాత్ర..!

నిర్మాతగా రష్మిక
`ఆచార్య`లో రష్మికా మందన్న?
`భీష్మ`తోనూ రష్మిక కొనసాగిస్తుందా?
అప్పుడే పది చేశానా..!
పండగలనే టార్గెట్ చేసుకున్న రష్మిక చిత్రాలు

నేను మంచి కాపీ క్యాట్ ని
కొత్త సంవత్సరంలో బిజీ బిజీ గా రష్మిక
ఫ్యాన్స్ కు రష్మిక ప్రశ్న ఎలాంటి పాత్రలు చేయాలి..?
లాక్ డౌన్ లో సెలబ్రిటీస్ అందరూ సోషల్ మీడియా కు చాలా దగ్గరయ్యారు. సోషల్ మీడియాలోకాస్త తక్కువ గడిపేవాళ్ళు బాగా యాక్టీవ్ అవుతున్నారు. అసలు అకౌంట్స్ లేనివాళ్లు కొత్తగా అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎలాగు షూటింగ్స్, సినిమాలు లేవు కాబట్టి ఈ రకంగా అయినా ఫ్యాన్స్ కు దగ్గరగా వుంటున్నారు. ఈ నేపథ్యంలో రష్మిక కూడా సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో తరచుగా ముచ్చటిస్తూనే ఉంటుంది.
ఆ సినిమాలో నేను లేను.. అందులో నిజం లేదు..!
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు... విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. అర్జునరెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్ ఈ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం షాహిద్ కపూర్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.
ఇంట్లో ఉంటే ఇంత బాగుంటుందనుకోలేదు..!
దాదాపు రెండు నెలల నుండి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ నేపథ్యంలో హీరోయిన్ రష్మిక మందన్న సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. ఇప్పటికే లైవ్ ల ద్వారా పలుమార్లు అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగే ప్రశ్నలకు కాస్త కొంటెగా సమాధానాలు కూడా ఇచ్చేది. ఇక ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈ లాక్ డౌన్ అనుభవం గురించి కాస్త ఎమోషనల్ గా ఒక నోట్ రాసుకొచ్చింది.

వార్నర్ చంపేశావ్ పో.. నవ్వు ఆగడం లేదు..!
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సోషల్ మీడియా లో చేస్తున్న హంగామా తెలిసిందే. ఐపీఎల్ ఆగిపోయిందే అనుకుంటున్న వారిని తన వీడియోలతో అలరిస్తున్నాడు. తెలుగు సినిమా పాటలు, డైలాగ్స్ చెప్తూ వీడియో షేర్ చేస్తూ షాకిస్తున్నాడు. అలవైకుంఠపురం మూవీలోని 'రాములో రాములా', 'బుట్టబొమ్మ' పాటలకు ఫ్యామిలీతో చిందేసి అల్లు అర్జున్‌తో పాటు అతని అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. దానితో ఆగకుండా.. పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పిన ఒక్కసారి కమిటైతే 'నా మాట నేనే వినను' అనే డైలాగ్ చెప్పిన వార్నర్.. ఆ మూవీ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ప్రశంసలతో పాటు సినిమా ఆఫర్‌ను అందుకున్నాడు. అనంతరం బాహుబలి సినిమాలో…
ఆలోచన రేకెత్తించే రష్మిక పోస్ట్
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న కన్నడ బ్యూటీ రష్మిక కరోనా లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయ్యి సోషల్ మీడియా లో యాక్టివ్ గా వుంటున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో ఫోటోలు, వీడియో లు షేర్ చేస్తూ రష్మిక టైమ్ పాస్ చేస్తున్నారు. ఇప్పుడు రష్మిక ఆలోచన రేకెత్తించే ఒక పోస్ట్ ను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.

"సహజ సుందరి" రష్మిక
బ్లాక్ బస్టర్ "ఛలో " మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన కన్నడ బ్యూటీ రష్మిక "గీత గోవిందం ", "సరిలేరు నీకెవ్వరు", "భీష్మ" వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరించారు. కన్నడ మూవీస్ లో కూడా నటిస్తున్న రష్మిక "సుల్తాన్"మూవీ తో కోలీవుడ్ కు ఎంటర్ అవుతున్నారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న "పుష్ప "మూవీలో నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా "పుష్ప "మూవీ షూటింగ్ నిలిచిపోయింది.
'హ్యాపీ బర్త్ డే' మై కామ్రేడ్..!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలు వచ్చాయి. వీటిలో 'గీత గోవిందం' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొత్తగా... 'డియర్ కామ్రేడ్' మాత్రం అంత విజయం దక్కించుకోలేక పోయింది. ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరి పై పలు రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఈ రోజు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పింది రష్మిక. తన ట్విట్టర్ లో హ్యాపీ బర్త్ డే మై డియర్ కామ్రేడ్ అంటూ పేర్కొంది.
"పుష్ప " మూవీ లో రష్మిక స్పెషల్ లుక్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో "పుష్ప " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్, జగపతి బాబు, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో "పుష్ప"హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతుంది.

రష్మిక మీ భర్త కావాలని ఉంది.. అయితే అతడి అనుమతి తీసుకోవాలి..!
కరోనా వల్ల సినిమా సెలెబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇక సోషల్ డిస్టెన్స్ అయితే వుంది కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులకు ఎప్పటికప్పుడు దగ్గరగానే వుంటున్నారు. వాళ్ళతో లైవ్ ల ద్వారా మాట్లాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రష్మిక కూడా తన అభిమానులతో మాట్లాడి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అంతే కాదు కాస్త కామెడీ కూడా చేసింది. ఇక సందర్భంగా ఒక అభిమాని ఆ దేవుడు నాకు ఎదురైతే నన్ను నీ భర్తని చేయమని అడుగుతా అని అనగా.. దానికి రష్మిక దయచేసి ముందు ఇతడి అనుమతి తీసుకో అని తన పెంపుడు కుక్క ఫొటో షేర్ చేసింది. అంతేకాదు ఇంకా చాలా ప్రశ్నలు అడగగా వాటికి కూడా సమాధానాలు చెప్పింది.
కరోనా పై పోరాటంలో విజయం సాధిస్తాం - రష్మిక
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రజలు ప్రాణ భయం తో కొట్టుమిట్టాడుతున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ కూడా కొనసాగుతుంది. పలువురు సినీ సెలబ్రిటీస్ ప్రజలకు కరోనా వైరస్ వ్యాప్తి నివారణ జాగ్రత్తలపై అవగాహన కలిపిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న కన్నడ బ్యూటీ రష్మిక తన వంతుగా ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
చిత్తూరు యాస భాష ప్రాక్టీస్ లో రష్మిక?
మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో "పుష్ప " మూవీ రూపొందుతుంది. పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న "పుష్ప " మూవీ 5భాషలలో రిలీజ్ కానుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న ఈ మూవీ లో అల్లు అర్జున్ చిత్తూరు యువకుడిగా నటిస్తున్నారు. చిత్తూరు యాస భాష ను నేర్చుకున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'పుష్ప' సినిమాలో హైలైట్ గా రష్మిక పాత్ర..!
ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ తోనే అల్లు అర్జున్ సోషల్ మీడియాలో రికార్డ్స్ ను క్రియేట్ చేయడం మొదలు పెట్టాడు. ట్విట్టర్ లో అత్యధిక లైక్స్ అందుకున్న ఫస్ట్ లుక్ గా పుష్ప నిలిచింది. తెలుగు చిత్రాలలో ఎక్కువ ట్విట్టర్ లైక్స్ దక్కించుకున్న మూవీగా పుష్ప రికార్డు క్రియేట్ చేసింది.

నిర్మాతగా రష్మిక
బ్లాక్ బస్టర్ "ఛలో" మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన కన్నడ బ్యూటీ రష్మిక "గీత గోవిందం", "సరిలేరు నీకెవ్వరు" , "భీష్మ" వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో అగ్ర తారగా దూసుకుపోతున్నారు. రష్మిక ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి కొత్త దర్శకులకు అవకాశం కల్పించాలని ప్లాన్ చేస్తున్నారు.
`ఆచార్య`లో రష్మికా మందన్న?
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న చిత్రం `ఆచార్య`. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి దాదాపు 30 శాతం చిత్రీకరణ పూర్తయిందని సమాచారం.
`భీష్మ`తోనూ రష్మిక కొనసాగిస్తుందా?
సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు` అంటూ సందడి చేసిన కన్నడ కస్తూరి రష్మికా మందన్న.. మహాశివరాత్రికి `భీష్మ`తో పలకరించనుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే... ఈ రెండు సినిమాలకూ తనే డబ్బింగ్ చెప్పుకుంది రష్మిక. `సరిలేరు నీకెవ్వరు`లో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం రష్మికకి కలసి వచ్చిన నేపథ్యంలో... `భీష్మ`కి కూడా అది కొనసాగుతుందేమో చూడాలి. రేపు (ఫిబ్రవరి 21) ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
అప్పుడే పది చేశానా..!
సినీ పరిశ్రమలోకి రోజుకు ఎంతో మంది హీరోయిన్ అయిపోదామని వస్తుంటారు. కానీ అదృష్టం కొంతమందిని మాత్రమే వరిస్తుంది. స్టార్ హీరోయిన్ రేంజ్ కు తీసుకెళ్తుంది. అలా ఇండిస్టీలోకి అడుగుపెట్టిన కొద్దికాలానికే స్టార్ హీరోయిన్ గా ఎదిగి.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది రష్మిక మందన్న. కిరాక్ పార్టీ అనే సినిమాతో కన్నడ చిత్ర సీమలో అడుగుపెట్టి తొలి సినిమాతోనే సూపర్ హిట్ ను దక్కించుకుంది. తెలుగులో వెంకీ కుడుముల దర్సకత్వంలో 'ఛలో' సినిమాతో పరిచయమై ఇక్కడ కూడా హిట్ కొట్టింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. అంతే ఆ తర్వాత వరుస ఆఫర్స్ అమ్మడి వెంట పడ్డాయి. వరుస…
పండగలనే టార్గెట్ చేసుకున్న రష్మిక చిత్రాలు
`ఛలో`తో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ కోమలి రష్మికా మందన్న... ఆపై `గీత గోవిందం`తో స్టార్ డమ్ చూసింది. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ బ్యూటీ నటించిన కొత్త చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. విశేషమేమిటంటే... ఆయా చిత్రాలు ఫెస్టివల్ సీజన్స్ లోనే తెరపైకి రాబోతున్నాయి.
ప్రభాస్, నాగచైతన్య లకు జోడీ గా నటించాలని ఉంది _ రష్మిక
బ్లాక్ బస్టర్ "ఛలో " మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన కన్నడ బ్యూటీ రష్మిక "గీత గోవిందం " మూవీ ఘనవిజయంతో స్టార్ డమ్ పొందారు. పలు మూవీ కమిట్ మెంట్స్ తో రష్మిక బిజీగా మారారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తో రష్మిక జంటగా నటించిన "సరిలేరు నీకెవ్వరు మూవీ జనవరి 11వ తేదీ రిలీజ్ కానుంది. యంగ్ హీరో నితిన్ కు జోడీ గా నటించిన "భీష్మ " మూవీ ఫిబ్రవరి 21 వ తేదీ రిలీజ్ కానుంది. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తో రష్మిక జతకట్టిన "AA 20" మూవీ సెట్స్ పై ఉంది.

నేను మంచి కాపీ క్యాట్ ని
ఛలో', 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి సూపర్‌హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రష్మిక మందన్నా. తాజాగా సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ రష్మిక మందన్నా ఇంటర్వ్యూ.
కొత్త సంవత్సరంలో బిజీ బిజీ గా రష్మిక
బ్లాక్ బస్టర్ "ఛలో " మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించి తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక " గీత గోవిందం "మూవీ ఘనవిజయంతో స్టార్ హీరోయిన్ గా మారి పలు అవకాశాలను అందుకున్నారు. ఒక వైపు యంగ్ హీరోలతో నటిస్తూనే, మరో వైపు స్టార్ హీరోలతో నటిస్తూ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారారు. కన్నడ మూవీస్ లో కూడా నటిస్తున్న రష్మిక కోలీవుడ్ లో కార్తీ హీరోగా రూపొందుతున్న తమిళ మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.