“పుష్ప ” మూవీ లో రష్మిక స్పెషల్ లుక్

Actress Rashmika Mandanna Sports A New Look For Allu Arjun Pushpa Movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో “పుష్ప ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్, జగపతి బాబు, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో “పుష్ప”హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై రూపొందుతున్న “పుష్ప ” మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో హీరోయిన్ రష్మిక ఒక స్పెషల్ లుక్ లో కనిపించనున్నారు. రష్మిక మేకప్, లుక్ డిఫరెంట్ గా ఉండేలా దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు పక్కింటి అమ్మాయి పాత్రలలో నటించిన రష్మిక “పుష్ప ” మూవీ లో సాలిడ్ ట్విస్ట్స్ తో కూడిన ఒక కీలక పాత్రలో నటిస్తారని సమాచారం, బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠపురములో .. మూవీ తరువాత అల్లు అర్జున్ నటించే “పుష్ప ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.