విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలు వచ్చాయి. వీటిలో ‘గీత గోవిందం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొత్తగా… ‘డియర్ కామ్రేడ్’ మాత్రం అంత విజయం దక్కించుకోలేక పోయింది. ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరి పై పలు రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఈ రోజు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పింది రష్మిక. తన ట్విట్టర్ లో హ్యాపీ బర్త్ డే మై డియర్ కామ్రేడ్ అంటూ పేర్కొంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Happiest birthday to my comrade! 🐷 @TheDeverakonda aaaaaaaaaaa! 💃🏻✨ pic.twitter.com/NPbpl21fkE
— Rashmika Mandanna (@iamRashmika) May 9, 2020
రష్మిక మందన.. ప్రస్తుతం టాలీవుడ్లో మంచి ఫామ్‌లో ఉన్న హీరోయిన్. ఆమెకు అటు కన్నడలోనూ.. ఇటు తెలుగులోనూ బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా, రష్మిక ఈ ఏడాది రెండు సూపర్ హిట్ సినిమాలతో మంచి జోరుమీదున్నారు. మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’, నితిన్‌తో ‘భీష్మ’ సినిమాలు చేసి రష్మిక విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ‘పుష్ప’ సినిమాలో బన్నీ సరసన నటించబోతున్నారు. ఇందులో రష్మికది డీగ్లామరస్ రోల్ అని ప్రచారం జరుగుతోంది. లాక్డౌన్ పూర్తికాగానే ‘పుష్ప’ సినిమా షూటింగ్లో రష్మిక పాల్గొంటారు.
ప్రస్తుతం విజయ్ పూరీ దర్శకత్వంలో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. కరోనా వల్ల ఈ సినిమాకు షూటింగ్ కు బ్రేక్ పడింది. అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: