`ఆచార్య‌`లో రష్మికా మంద‌న్న‌?

Rashmika Mandanna To Pair Up With Ram Charan In Acharya

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రూపొందిస్తున్న చిత్రం `ఆచార్య‌`. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత‌మందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి దాదాపు 30 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ సినిమాలో చిరుతో పాటు మ‌రో క‌థానాయ‌కుడి పాత్ర కూడా ఉంటుంద‌ని.. అందులో రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా, చ‌ర‌ణ్ కి జోడీగా ర‌ష్మిక ఎంపికైంద‌ని వినిపిస్తోంది. ఒక పాట‌తో పాటు కొన్ని కీల‌క స‌న్నివేశాల్లో క‌నిపించే ఈ పాత్ర‌కి ర‌ష్మిక అయితేనే బావుంటుంద‌ని చిరు భావిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ర‌ష్మిక ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది. అలాగే, చిరంజీవికి జోడీగా న‌టించే నాయిక ఎవ‌రో కూడా మ‌రికొద్దిరోజుల్లో స్ప‌ష్ట‌త వ‌స్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 4 =