‘పుష్ప’ సినిమాలో హైలైట్ గా రష్మిక పాత్ర..!

Rashmika Mandanna's Role Going To Be A Key Highlight In Pushpa Movie
Rashmika Mandanna's Role Going To Be A Key Highlight In Pushpa Movie

ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ తోనే అల్లు అర్జున్ సోషల్ మీడియాలో రికార్డ్స్ ను క్రియేట్ చేయడం మొదలు పెట్టాడు. ట్విట్టర్ లో అత్యధిక లైక్స్ అందుకున్న ఫస్ట్ లుక్ గా పుష్ప నిలిచింది. తెలుగు చిత్రాలలో ఎక్కువ ట్విట్టర్ లైక్స్ దక్కించుకున్న మూవీగా పుష్ప రికార్డు క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్ననటిస్తున్న సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు రష్మిక పాత్రపై సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో రష్మిక పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని అంటున్నారు. అంతే కాదు ఇప్పటి వరకూ తాను చేసిన సినిమాలకు ఇది డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. గిరిజన యువతిగా ఆమె పాత్ర ఉంటుందని… రష్మిక కెరియర్లో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర అవుతుందనే అభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. ఇది కనుక నిజమైతే రష్మిక పంట పండినట్టే..

కాగా ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.