ట్యాగ్ · 134 కథనాలు · పేజీ 6
'రాధే శ్యామ్' టీం కు ప్రభాస్ గిఫ్ట్స్
మీప్రేమకు థ్యాంక్స్ డార్లింగ్స్

కాంబినేషన్ లో 'ప్రభాస్ 22'..?
యోగా స్టూడెంట్ ప్రభాస్

ప్రభాస్ అరుదైన రికార్డ్
మంచు లక్ష్మీ కూతురికి ప్రభాస్ సర్ ప్రైజ్..!
ఫారెస్ట్ ను దత్తత తీసుకున్న 'బాహుబలి'
ప్రభాస్ గ్రీన్ ఛాలెంజ్

ప్రభాస్ ఫేస్ బుక్ రికార్డ్

#Prabhas 21 మూవీలో డిఫరెంట్ లుక్
స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న 'ప్రభాస్ 21'
'కేజీఎఫ్' డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ఖాయమేనట..!
ప్రభాస్ మూవీ కోసం భారీ హాస్పిటల్ సెట్?

"సాహో రే" ప్రభాస్

ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా ఇప్పట్లో లేనట్టే..
స్వీయ గృహ నిర్బంధం లో ప్రభాస్
'కరోనా' కే ఛాలెంజింగ్ గా ప్రభాస్ టీమ్..!
ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ రికార్డ్
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.“రాధేశ్యామ్ “మూవీ తరువాత హీరో ప్రభాస్ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీ , ఓం రౌత్ మైథలాజికల్ “ఆదిపురుష్ “మూవీ , ప్రశాంత్ నీల్ గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్ “కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
'రాధే శ్యామ్' టీం కు ప్రభాస్ గిఫ్ట్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సెట్స్ లో ఉన్న వాళ్ళని ఎలా చూసుకుంటాడో ఆయనతో పనిచేసిన చాలా మంది ఎన్నో సందర్భాల్లో చెప్పారు మనం కూడా విన్నాం. ఇంటినుండి వండించుకొని మరీ అందరికీ భోజనం పెడుతుంటాడు. గిఫ్ట్స్ ఇస్తుంటాడు. ఇక ఇప్పుడు రాధే శ్యామ్ టీం కు కూడా సర్ప్రైజ్ ఇచ్చాడు ఈ ఆజానుబాహుడు.
మీప్రేమకు థ్యాంక్స్ డార్లింగ్స్
బాహుబలి, సాహో ల తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. అప్పటినుండి ఏదో ఒక రికార్డు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా ప్రభాస్ ఫేస్ బుక్ పేజికి 20 మిలియన్ల ఫాలోవర్స్ రావడంతో సరికొత్త రికార్డు ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడు నెలల క్రితమే 15 మిలియన్స్ క్రాస్ చేసిన ప్రభాస్ ఇప్పుడు 20 మిలియన్ మార్క్‌ను టచ్ చేశారు. దీంతో సౌత్‌లోనే ఫేస్‌బుక్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న ఘనత ప్రభాస్‌కు మాత్రమే సొంతమైంది. సౌత్ ఇండియాలో ఎక్కువమంది పాలోవర్స్ ఉన్న హీరోగా ఫేస్ బుక్ లో కొత్త రికార్డును క్రియేట్ చేసాడు. ఈ సందర్భంగా ప్రభాస్.. తన అభిమానులు, ఫాలోవర్స్‌కు ప్రత్యేక…
'ప్రభాస్ 22' టైటిల్ పోస్టర్ రిలీజ్
గత కొద్దినెలల ముందు అయితే ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అన్నట్టు.. ఒక్క అప్ డేట్ ఒకే ఒక్క ప్రభాస్ సినిమా అప్ డేట్ అంటూ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవారు ప్రభాస్ ఫ్యాన్స్. అయినా కూడా కష్టంగా ఉండేది. అయితే ఈ మధ్య కాస్త పంథా మార్చారు. ప్రభాస్ 20 రాధేశ్యామ్ సినిమా అప్ డేట్ ఇచ్చిన దగ్గర నుండి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ ఫ్యాన్స్ కు కాస్త ఊరట కలిగిస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఎలాంటి హడావుడి లేకుండా ప్రభాస్ 22 సినిమా అప్ డేట్ ఇచ్చి షాకిచ్చారు.

కాంబినేషన్ లో 'ప్రభాస్ 22'..?
ఒక పక్క బాహుబలి సిరీస్.. సాహూ సినిమాలతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న హీరో ప్రభాస్.. మరోపక్క కె.జి.యఫ్ తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్.. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటది. ఆ ఊహే చాలా హై లో వుంది కదా. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటూ ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే తాజాగా మరోసారి ఈ కాంబినేషన్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ కాంబోలో సినిమా రావడం గ్యారెంటీ అంటున్నాయి సినీ వర్గాలు. అంతేకాదు ఇప్పటికే కథ కూడా రెడీ అయ్యిందని అంటున్నారు. అయితే ఈ సినిమా రావడానికి లేట్ అవ్వొచ్చు…
యోగా స్టూడెంట్ ప్రభాస్
అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా లో కొన్ని ఫొటోస్ తో పాటు ఒక వీడియో ను రిలీజ్ చేశారు. తాను యోగా స్టూడెంట్ నని , తన యోగా అనుభవాలను అభిమానులకు షేర్ చేశారు. యోగా తో ఎంతో రిలీఫ్ గా ఉంటుందని , ఫిట్ గా ఉంటామని , యోగా తో అనేక ప్రయోజనాలు ఉన్నాయని ప్రభాస్ తెలిపారు.

ప్రభాస్ అరుదైన రికార్డ్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన "బాహుబలి ", "బాహుబలి 2" మూవీస్ రికార్డ్కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తం గా తెలుగు సినిమా సత్తా చాటాయి. "బాహుబలి ", "బాహుబలి 2" మూవీస్ రష్యా ప్రేక్షకులను అలరించాయి. దేశ వ్యాప్తం గానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కు అభిమాన గణం పెరిగింది. ప్రభాస్ ఇప్పుడు అరుదైన రికార్డ్ ను స్వంతం చేసుకున్నారు.
మంచు లక్ష్మీ కూతురికి ప్రభాస్ సర్ ప్రైజ్..!
మంచు మోహన్ బాబు, కృష్ణం రాజు ఫ్యామిలీస్ కు మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణకు సర్ ప్రైజ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. రీసెంట్‌గా మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ పుట్టినరోజు వేడుకలు తన ఇంట్లో సింపుల్‌గా జరిగిపోయాయి. ఈ సందర్భంగా విద్యా నిర్వాణకి ప్రభాస్ వీడియో కాల్ చేసి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడట. అంతేకాదు మంచు లక్ష్మీ ఫ్యామిలీతో చాలాసేపు మాట్లాడట. ఇక ఈ విషయాన్ని మంచు లక్ష్మి తన సోషల్ మీడియా ఎక్కౌంట్ ద్వారా తెలియచేసింది. ప్రభాస్ మమ్మల్ని సర్పైజ్ చేసాడని.. ప్రభాస్ కాల్ కు నిర్వాణ మురిసిపోయింది అని తెలిపింది. దీనితో ప్రభాస్ మరోసారి…
ఫారెస్ట్ ను దత్తత తీసుకున్న 'బాహుబలి'
జోగినిపల్లి సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమాన్ని ఎప్పుడో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రంలో ఎంతో మంది పాల్గొని మొక్కలు నాటగా తాజాగా ప్రభాస్ కూడా ఈ ఛాలెంజ్ ను స్వీకరించాడు. రెబల్ స్టార్ కృష్ణంరాజు విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రభాస్ తనవంతుగా తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. అనంతరం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, రానా, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కు నామినేట్ చేస్తున్నాను అని తెలిపారు. అంతేకాదు ఈ సందర్భంగా ప్రభాస్ మరో గొప్ప నిర్ణయం తీసుకున్నాడు.
ప్రభాస్ గ్రీన్ ఛాలెంజ్
లాక్ డౌన్ వల్ల సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. షూటింగ్స్ లేకపోవడంతో తమ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. అయితే షూటింగ్ లకు వెళ్లకపోయినా.. బయటకు రాకపోయినా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటూనే ఉన్నారు. అప్పుడప్పుడు పలు వీడియోల ద్వారా కనిపిస్తూనే వున్నారు. అయితే ప్రభాస్ మాత్రం ఇంతవరకూ కనిపించింది లేదు. దాదాపు రెండు నెలలుగా ఒక్కాసారి కూడా కెమెరా కంటికి చిక్కని ప్రభాస్.. ఇప్పుడు ఫైనల్ గా కెమెరా ముందుకు వచ్చారు. ప్రభాస్ తాజాగా గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. తాజాగా టీఆర్ఎస్ నేత, ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాడు…

ప్రభాస్ ఫేస్ బుక్ రికార్డ్
బ్లాక్ బస్టర్ "బాహుబలి ", "బాహుబలి 2" మూవీస్ తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కు దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. స్టైలిష్ యాక్షన్ మూవీ "సాహో "తో ప్రభాస్ మూవీస్ పై బాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది. దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న ప్రభాస్ ఫేస్ బుక్ పేజీ లో రికార్డ్ క్రియేట్ చేశారు. 14 మిలియన్ ఫాలోవర్స్ తో ఫస్ట్ సౌత్ ఇండియన్ స్టార్ గా ప్రభాస్ రికార్డ్ నెలకొల్పారు.
రానా పెళ్లి - సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న రానా - ప్రభాస్ పై ఫన్నీ మీమ్స్
ఎంకి పెళ్లి సుబ్బు చావుకి వచ్చింది అన్న సామెత వినే ఉంటారు కదా.. ఇప్పుడు బాహుబలి ప్రభాస్ ను చూస్తే అదే గుర్తొస్తుంది. దీనికి కారణం ఏంటో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు అనుకుంటా..రానా పెళ్లి విషయమే. నిన్న సోషల్ మీడియా వేదికగా తన ప్రేమను బయటి ప్రపంచానికి చెప్పి ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. అందరూ ఏమో కానీ టాలీవుడ్ లో కొందరు హీరోలు మాత్రం రానా పై ఫన్నీ కామెంట్స్ వేస్తున్నారు. సాయి తేజ్ ఇందంతా కలా.. మళ్ళీ పడుకుందాం అని ట్వీట్ చేయగా.. నాని అయితే 2020 లో ఇంకా ఏమేం చూస్తామో అని ఫన్నీ గా ట్వీట్ చేశాడు. ఇక ప్రభాస-రానా పై అయితే ఒక రేంజ్ లో ట్వీట్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఈ రోజు ఈ మీమ్స్ మీదనే రచ్చ…

#Prabhas 21 మూవీలో డిఫరెంట్ లుక్
గోపీకృష్ణా మూవీస్, యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ #Prabhas 20 మూవీ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే. మరో షెడ్యూల్ తో #Prabhas 20 మూవీషూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. హీరో ప్రభాస్ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న 'ప్రభాస్ 21'
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ అధినేత సి.అశ్వనీదత్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
'కేజీఎఫ్' డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ఖాయమేనట..!
ప్రభాస్ తో కేజీఎఫ్ డైరెక్టర్ సినిమా.. ఇది ఎప్పటినుండో వస్తున్న వార్తలే. అప్పట్లో ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను కలిసి ఓ కథను వినిపించాడని... ఇక ప్రభాస్ కు కథ నచ్చి ఓకే చెప్పినట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకూ ఆ వార్తలపై క్లారిటీ రాలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం... ఈ డైరెక్టర్ తో ప్రభాస్ తో సినిమా ఖాయమైనట్టే వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సినిమా సీక్వెల్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారుఅది పూర్తయిన తరువాత ప్రభాస్ స్క్రిప్ట్ పై కూర్చుంటాడని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నట్టు తెలుస్తోంది.
ప్రభాస్ మూవీ కోసం భారీ హాస్పిటల్ సెట్?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణ కాంబినేషన్‌లో ఓ పీరియాడిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘రాధే శ్యామ్’, `ఓ డియర్` అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్న ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ యాక్ట్రస్ భాగ్యశ్రీ కీలక పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. ఇదిలా ఉంటే... ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో ప్రభాస్ గెటప్స్ కి సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

"సాహో రే" ప్రభాస్
ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే ఇండియా లో తన ప్రతాపం చూపుతుంది. కరోనా వైరస్ కారణంగా ప్రజల దైనందిక కార్యక్రమాలపై ఎఫెక్ట్ పడింది. ప్రాణాలు హరిస్తున్న కరోనా కారణం గా జన జీవనం అల్లకల్లోలమయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలతో ప్రజలు అప్రమత్తం తో ప్రజలు ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. కరోనా కట్టడి కై కేంద్ర, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విశేషంగా కృషి చేస్తున్నాయి. మార్చి 22 వ తేదీ కర్ఫ్యూ ప్రకటించిన ప్రధాని మోదీ ప్రజా శ్రేయస్సు కై 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు.

ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా ఇప్పట్లో లేనట్టే..
నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా ఉంటుందని మనకు తెలిసిందే కదా. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలని అనుకున్నారు. కానీ కరోనా ఎఫెక్ట్ ఈ సినిమాపై కూడా పడింది. ప్రస్తుతం కరోనా కారణంగా దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ లాక్‌డౌన్ అయింది. ఎక్కడి షూటింగ్ అక్కడే ఆగిపోయాయి. మళ్లీ షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయో కూడా తెలీదు. ఒక వేళ అయినా ప్రభాస్ ముందు రాధా కృష్ణ సినిమాలో జాయిన్ అవ్వాలి.ఇక ఈ సినిమా అయిపోతేకానీ ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా ప్రారంభించాడు. అలా ఈ ఏడాది చివరిలో ప్రారంభించాలన్న ఈ సినిమా కాస్త వచ్చే ఏడాదికి వెళ్ళిపోయింది. మరి…
స్వీయ గృహ నిర్బంధం లో ప్రభాస్
గోపీకృష్ణా మూవీస్, యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ #Prabhas 20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ కాగా బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.
'కరోనా' కే ఛాలెంజింగ్ గా ప్రభాస్ టీమ్..!
ప్రస్తుతం ఎక్కడ విన్నా ఎక్కువగా వినిపించే పేరు 'కరోనా'. ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తోంది ఈ కరోనా. చైనా పుట్టిన ఈ మహమ్మారి వైరస్.. చిన్నగా పలు దేశాల్లో వ్యాపిస్తుంది. దీనితో జనాలు బయట తిరగడం మానేశారు. స్కూళ్ళు, ఆఫీస్ లకు సెలవలు ప్రకటించారు. ఇక సినీ పరిశ్రమలు కూడా తమ షూటింగ్ లను ఆపేసుకుంటున్నాయి. థియేటర్స్ మూసేయడంతో సినిమాల రిలీజ్ లను వాయిదా వేసుకుంటున్నారు. అంతేకాదు కరోనా వల్ల తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ మరియు ఆంధ్ర షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు.