మంచు మోహన్ బాబు, కృష్ణం రాజు ఫ్యామిలీస్ కు మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణకు సర్ ప్రైజ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. రీసెంట్‌గా మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ పుట్టినరోజు వేడుకలు తన ఇంట్లో సింపుల్‌గా జరిగిపోయాయి. ఈ సందర్భంగా విద్యా నిర్వాణకి ప్రభాస్ వీడియో కాల్ చేసి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడట. అంతేకాదు మంచు లక్ష్మీ ఫ్యామిలీతో చాలాసేపు మాట్లాడట. ఇక ఈ విషయాన్ని మంచు లక్ష్మి తన సోషల్ మీడియా ఎక్కౌంట్ ద్వారా తెలియచేసింది. ప్రభాస్ మమ్మల్ని సర్పైజ్ చేసాడని.. ప్రభాస్ కాల్ కు నిర్వాణ మురిసిపోయింది అని తెలిపింది. దీనితో ప్రభాస్ మరోసారి డార్లింగ్ అని నిరూపించుకున్నాడు అని నెటిజన్లు అంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగాప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ సినిమాతో పాటు నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.
Darling for all the right reasons 😍😍
When #Prabhas surprised @LakshmiManchu‘s daughter on her birthday 🤗 pic.twitter.com/CL3GjgzVrS— Telugu FilmNagar (@telugufilmnagar) June 17, 2020




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























