
ట్యాగ్ · 66 కథనాలు


ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పవన్

ఉస్తాద్ బ్యాక్ టు యాక్షన్

ఓజీ గ్లింప్స్ రిలీజ్

OG లో బాలీవుడ్ స్టార్ హీరో

నేను మీకు బాగా కావాల్సిన వాడిని ట్రైలర్ రిలీజ్

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా

కార్తికేయ 2 మూవీ పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

'హరిహర వీరమల్లు' యాక్షన్ మోడ్ లో పవన్..!

పవన్ సినిమాపై హరీష్ శంకర్.. తరువాత చెబుతా..!

త్వరలో సెట్స్ పైకి "హరి హర వీరమల్లు"

"తమ్ముడు" మూవీ పవన్ కళ్యాణ్ కే కరెక్ట్ - అజిత్

పవన్ కళ్యాణ్ రష్యా వెకేషన్ పూర్తి

'హరిహర వీరమల్లు' కోసం 'రాక్ స్టార్' హీరోయిన్

ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్‌లో పవన్ కళ్యాణ్.. కొత్త షెడ్యూల్ స్టార్ట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ క్రేజీ కాంబోలో రూపొందుతున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్ కల్యాణ్ అభిమానులకు కావాల్సిన అన్ని మాస్ ఎలిమెంట్స్ ఉంటాయని గ్లింప్స్‌తోనే క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ హరీష్ శంకర్. భగత్.. భగత్ సింగ్.. మహంకాళి పోలీస్ స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ గ్లింప్స్ వీడియోలో తనదైన మ్యానరిజంతో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ కి…

ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పవన్
బ్లాక్ బాస్టర్ గబ్బర్ సింగ్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్.ఇటీవలే ఈసినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో ప్రారంభమైంది.అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయిడు అరెస్ట్ నేపథ్యంలో హుటాహుటిన విజయవాడకు వెళ్లి రెండో రోజుల తరువాత పవన్ తిరిగి నిన్న హైదరాబాద్ కు చేరుకున్నాడు.ప్రస్తుతం పవన్ మళ్ళీ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు.ఈషెడ్యూల్ లో ఫైట్ మాస్టర్ లు రామ్- లక్ష్మణ్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఉస్తాద్ బ్యాక్ టు యాక్షన్
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి సినిమాను ప్రకటించినప్పటి నుండే అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమాను ప్రకటించిన తరువాత సెట్స్ పైకే చాలా లేట్ గా వెళ్లింది. ఈమధ్యే షూటింగ్ ను స్టార్ చేశారు.

ఉస్తాద్ భగత్ సింగ్ నుండి పవన్ పోస్టర్ రిలీజ్
పవన్ కళ్యాణ్,హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్.గబ్బర్ సింగ్ తరువాత ఈ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో భగత్ సింగ్ ఫై భారీ అంచనాలు వున్నాయి.ఇప్పటివరకు 20శాతం షూటింగ్ జరుపుకోగా త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఇక ఈసినిమా నుండి ఈరోజు పవన్ బర్త్ డే సందర్భంగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈపోస్టర్ లో పవన్ మాస్ గా కనిపించాడు.

తమ్ముడు పవన్ కళ్యాణ్ కు అన్నయ్య చిరంజీవి బర్త్ డే విషెస్
టాలీవుడ్ స్టార్ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం నేడు. నేటితో ఆయన 51 సంవత్సరాలు పూర్తి చేసుకుని 52వ పడిలోకి అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా.. ఆయనకు అభిమానులు, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా పవన్‌తో కలిసి తాము దిగిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. అలాగే ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఇదిలా ఉండగా తన తమ్ముడు జన్మదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి పవన్‌కు స్పెషల్ విషెస్ చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు.

పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కలయికలో కొత్త సినిమా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వినిపిస్తే అభిమానులకు పూనకాలే. సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా ఆయనను పిచ్చిగా అభిమానిస్తుంటారు మెగా ఫ్యాన్స్. అయితే గత కొంతకాలంగా ఆయన రాజకీయాలలో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయినా కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ పవన తన అభిమానులకు వినోదం పంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నుంచి అభిమానులు మరిన్ని ఎక్కువ సినిమాలు రావాలని కోరుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు చూసుకుంటూనే.. మరోవైపు వరుసగా సినిమాలు చేసుకుంటూ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. ఆయన కథానాయకుడిగా.. ఇప్పటికే 'హరిహరవీరమల్లు', 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి.

పవర్ స్టార్ బర్త్ డే వేళ.. హరి హర వీరమల్లు కొత్త పోస్టర్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తమ హీరోకు బర్త్ డే విషెస్ తెలుపుతూ అనేక పోస్టులు పెడుతున్నారు. ఇక మరోవైపు పవన్ కొత్త చిత్రాల నిర్మాతలు కూడా ఆయా సినిమాలకు సంబంధించి కీలక అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న అర్దరాత్రి 12:17కి పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమాలోని న్యూలుక్ రివీల్ చేసి ఫ్యాన్స్‌కి స్పెషల్ గిఫ్ట్ అందించింది చిత్ర యూనిట్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మూవీ టీమ్ ఒక పోస్ట్ చేసింది. అందులో.. ఇక 'ఈ సంతోషకరమైన రోజున మన హరి హర వీరమల్లు యొక్క అసాధారణమైన ధైర్యసాహసాలు…

ఓజీ గ్లింప్స్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓజీ గ్లింప్స్ కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది.ఈరోజు పవన్ బర్త్ డే సందర్భంగా ఈటీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.100 సెకండ్ల రన్ టైంతో వచ్చిన ఈ గ్లింప్స్ హైప్ కు ఏమాత్రం తగ్గకుండా వుంది.గ్లింప్స్ అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ గా పవన్ రూత్ లెస్ గ్యాంగ్ స్టర్ గా కనిపించాడు.గ్లింప్స్ లో పవన్ లుక్,తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యింది.పవన్ ను ఇంతకుముందు ఎప్పుడూ చూపించని విధంగా చూపిస్తున్నాడు డైరెక్టర్ సుజీత్.

OG లో బాలీవుడ్ స్టార్ హీరో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ముందు ముందు పవన్ రాజకీయాలతో బీజీగా ఉండాల్సి వస్తుంది అందుకే ఇప్పుడే వీలైనన్ని రోజులు షూటింగ్ లకు కేటాయిస్తున్నాడు. ప్రస్తుతం పవన్ అటు హరీష్ శంకర్ సినిమాతో అలానే సుజీత్ ఓజీతో షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ లను మాత్రం చాలా వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. వీటిలో ఓజీ సినిమా షూటింగ్ ఏప్రిల్ లో మొదలుపెట్టగా కొంతవరకూ పూర్తి చేసుకుంది.

నేను మీకు బాగా కావాల్సిన వాడిని ట్రైలర్ రిలీజ్
సినిమా జయాపజయాలను పక్కన పెడితే టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ‘రాజావారు రాణిగారు’, ‘ఎస్.ఆర్ కళ్యాణ మండపం’ వంటి వరుస హిట్లతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో నేను మీకు బాగా కావాల్సిన వాడిని కూడా ఒకటి. శ్రీధర్ గాదే దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కొత్త ట్రెండ్ నడుస్తుంది. తమ అభిమాన హీరోల బర్త్ డే కు వారి పాత సూపర్ హిట్ మూవీస్ స్పెషల్ షోస్ థియేటర్స్ లో ప్రదర్శిస్తూ అభిమానులు తమ అభిమానం చాటుకుంటున్నారు. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కు సూపర్ హిట్ పోకిరి మూవీ స్పెషల్ షోస్ భారీ వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే.మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే ఆగస్ట్ 22 కు హైదరాబాద్ లో బ్లాక్ బస్టర్ ఘరానా మొగుడు మూవీ స్పెషల్ షోస్ ను 21 , 22 తేదీలలో ప్రదర్శించిన విషయం తెలిసిందే.

కార్తికేయ 2 మూవీ పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది…

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
ఇండస్ట్రీలో ఏదైనా కొత్త ట్రెండ్ మొదలైతే అది ఎలా కొనసాగుతుందో తెలిసిందే కదా. ఇప్పటివరకూ హీరోల పుట్టినరోజుకు కామన్ డీపీని రిలీజ్ చేయడం చేశారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తుంది. అదే స్టార్ హీరో పాత సినిమాల స్పెషల్ షోస్ వేయడం. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా మహేష్ ఫ్యాన్స్ పోకిరి సినిమా స్పెషల్ షోస్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే కదా ఈ స్పెషల్ షోస్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో కూడా చూశాం.. అంతేకాదు ఇన్నేళ్ల తరువాత కూడా ఈసినిమా స్పెషల్ షోస్ వేసినా కూడా భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక పోకిరి సినిమాకు సూపర్ రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ తన హీరో సినిమా కోసం ఈగర్ గా…

'హరిహర వీరమల్లు' యాక్షన్ మోడ్ లో పవన్..!
పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే వకీల్ సాబ్ సినిమా ఈసినిమానే రిలీజ్ అవ్వాల్సిందే. కానీ ఈ సినిమా కంటే పవన్ వెనుక మొదలుపెట్టిన భీమ్లానాయక్ ముందు షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కూడా అయిపోయింది. ఇక భీమ్లానాయక్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో వకీల్ సాబ్, భీమ్లానాయక్ తో బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్లను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు అందరి దృష్టి హరిహర వీరమల్లు పై పడింది.

పవన్ సినిమాపై హరీష్ శంకర్.. తరువాత చెబుతా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తరువాత వరుస బ్లాక్ బస్టర్ లతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది వకీల్ సాబ్ సినిమాతో ఖాతా తెరిచిన పవన్ ఈ ఏడాది భీమ్లానాయక్ తో మరో సంచలన విజయం సాధించారు. బాక్సాఫీస్ వద్ద ఈసినిమా ఎంత ప్రభంజనం సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. దీంతో పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా, అలానే హరీష్ శంకర్ తో మరో సినిమా చేయబోతున్నాడు. వీటిలో క్రిష్ హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే మళ్లీ ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేయనున్నారు.

త్వరలో సెట్స్ పైకి "హరి హర వీరమల్లు"
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” మూవీ 2022 ఏప్రిల్ 29 వ తేదీ తెలుగు , తమిళ ,మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. అర్జున్ రామ్ పాల్ , ఆదిత్య మీనన్ , శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

"తమ్ముడు" మూవీ పవన్ కళ్యాణ్ కే కరెక్ట్ - అజిత్
శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ బ్యానర్ పై పి ఎ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ "తమ్ముడు " మూవీ 1999 జూలై 15 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ప్రీతీ జింగానియా కథానాయిక. పవన్ కళ్యాణ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దర్శకుడు అరుణ్ ప్రసాద్ "తమ్ముడు" మూవీని అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. రమణ గోగుల సంగీతం ప్రేక్షకులను అలరించింది.

పవన్ కళ్యాణ్ రష్యా వెకేషన్ పూర్తి
బ్లాక్ బస్టర్ "వకీల్ సాబ్ "మూవీ తో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన "భీమ్లా నాయక్ "మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న "హరి హర వీరమల్లు "మూవీ సెట్స్ పై ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో "భవదీయుడు భగత్ సింగ్ " మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

'మహేష్' ఫ్యామిలీ కి 'పవన్' ఫ్యామిలీ స్పెషల్ గ్రీటింగ్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు టాలీవుడ్ లో ఉన్న హీరోస్ కు మామిడి పండ్లు, పలు గిఫ్ట్స్ పంపిస్తూ సర్ ప్రైజ్ ఇస్తుంటాడు. ఈనేపథ్యంలో రీసెంట్ గానే దీపావళి బహుమతులు పంపిన పవన్.. తాజాాగా క్రిస్మస్ పండుగ సందర్భంగా స్పెషల్ గ్రీటింగ్స్ చెబుతూ గూడ్స్ పంపించారు. దీనిలో భాగంగానే తాజాగా మరోసారి మహేష్ బాబు దంపతులను సర్ ప్రైజ్ చేశారు పవన్ ఫ్యామిలీ. రేపు క్రిస్మస్ పండుగ సందర్భంగా పవన్ మరియు తన భార్య అన్నా మహేష్ కుటుంబానికి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రీటింగ్స్ ని పంపించారు. దీనితో ఈ గ్రీటింగ్స్ ని మహేష్ సతీమణి నమ్రత తన ఇన్స్టా ద్వారా షేర్ చేస్తూ ఈ లవ్లీ హాంపర్ ని పంపినందుకు ధన్యవాదాలు అంటూ…

'హరిహర వీరమల్లు' కోసం 'రాక్ స్టార్' హీరోయిన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. పీరియాడికల్ స్టోరీ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నిజానికి ఈసినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది కానీ మధ్యలో భీమ్లానాయక్ ను పూర్తి చేయడంతో ఈసినిమా వెనక్కి వెళ్లిపోయింది. కొత్త షెడ్యూల్ ను వచ్చే ఏడాది స్టార్ట్ చేయనున్నట్టు రీసెంట్ గానే క్లారిటీ ఇచ్చాడు క్రిష్.