పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

Good News for Powerstar Pawan Kalyan fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Powerstar Pawan Kalyan,Powerstar Pawan Kalyan Fans,Pawan Kalyan,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Pawan Kalyan Latest Movie,Pawan Kalyan Latest News,Pawan Kalyan Birthday,Jalsa special shows,Pawan Kalyan Birthday special show,Jalsa movie Special show,Jalsa,Jalsa Movie,Jalsa Telugu Movie

ఇండస్ట్రీలో ఏదైనా కొత్త ట్రెండ్ మొదలైతే అది ఎలా కొనసాగుతుందో తెలిసిందే కదా. ఇప్పటివరకూ హీరోల పుట్టినరోజుకు కామన్ డీపీని రిలీజ్ చేయడం చేశారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తుంది. అదే స్టార్ హీరో పాత సినిమాల స్పెషల్ షోస్ వేయడం. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా మహేష్ ఫ్యాన్స్ పోకిరి సినిమా స్పెషల్ షోస్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే కదా ఈ స్పెషల్ షోస్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో కూడా చూశాం.. అంతేకాదు ఇన్నేళ్ల తరువాత కూడా ఈసినిమా స్పెషల్ షోస్ వేసినా కూడా భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక పోకిరి సినిమాకు సూపర్ రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ తన హీరో సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అన్న సంగతి అందరికి తెలిసిందే. ఈసందర్భంగా జల్సా సినిమాను రీ రిలీజ్ చేయాలని పవన్ ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈసినిమాను కూడా 4కే లో రిలీజ్ చేస్తున్నారు. 4కే రిజల్యూషన్‌‌లోకి డిజిటలైజ్ చేసి మళ్లీ విడుదల చేయనున్నారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈసినిమా టెక్నికల్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులతో వైరల్ చేస్తున్నారు. ఇక ఈసినిమా ఎన్ని స్పెషల్ షోస్ రిలీజ్ చేస్తున్నారు.. ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు అన్న విషయాలు త్వరలో తెలియచేయనున్నారు.

కాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. పార్వతి మెల్టన్ మరో ఫీమేల్ లీడ్ రోల్ లో నటించింది. ఇంకా ఈసినిమాలో అలీ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, కమలినీ ముఖర్జీ, ముఖేష్ రిషీ, సునీల్, తనికెళ్ల భరణి, కమల్ కామరాజు, ఉత్తేజ్ తదితరులు నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈసినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =