పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే వకీల్ సాబ్ సినిమా ఈసినిమానే రిలీజ్ అవ్వాల్సిందే. కానీ ఈ సినిమా కంటే పవన్ వెనుక మొదలుపెట్టిన భీమ్లానాయక్ ముందు షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కూడా అయిపోయింది. ఇక భీమ్లానాయక్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో వకీల్ సాబ్, భీమ్లానాయక్ తో బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్లను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు అందరి దృష్టి హరిహర వీరమల్లు పై పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హిస్టారికల్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో పవన్ పాత్రపై ప్రేక్షకులతో పాటు అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు. హైద్రాబాద్ లో వేసిన ఓ స్పెషల్ సెట్ లో పవన్ యాక్షన్ సీక్వెన్ చిత్రీకరణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. పవన్ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్నట్టు సమాచారం. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఈసినిమాకే హైలెట్ నిలుస్తుందని కూడా అంటున్నారు. మరి ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం పవన్ ఇటీవల కసరత్తులు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయ్యాయో చూశాం. మరి సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా ఈసినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నుండి అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: