మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” మూవీ 2022 ఏప్రిల్ 29 వ తేదీ తెలుగు , తమిళ ,మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. అర్జున్ రామ్ పాల్ , ఆదిత్య మీనన్ , శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Power Star @PawanKalyan participated in 'Harihara Veeramallu' Script Reading Session.#HariHaraVeeraMallu #Powerstar #PawanKalyan @DirKrish @AMRathnamOfl @MegaSuryaProd pic.twitter.com/2zK4b9tkcQ
— Telugu FilmNagar (@telugufilmnagar) February 6, 2022
“హరిహర వీరమల్లు ” మూవీ కై భారీ సెట్స్ ను మేకర్స్ నిర్మించిన విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ నుంచి సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించడానికి మేకర్స్ సన్నాహాల్లో ఉన్నారు. యాక్షన్ సీన్స్ తో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. షూటింగ్ కు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నట్లు దర్శకుడు క్రిష్ ఓ ఫొటోను సోషల్ మీడియా లో షేర్ చేశారు ఆ ఫోటోలో పవన్, క్రిష్ లతో పాటు ఏఎం రత్నం, మదన్ కార్కీ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హీరో పవన్ కళ్యాణ్ నటిస్తోన్న తొలి పీరియాడికల్ డ్రామా “హరిహర వీరమల్లు” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: