
ట్యాగ్ · 183 కథనాలు


ఓజీ గ్లింప్స్ రిలీజ్
బ్రో టీజర్ రిలీజ్

అఫీషియల్- పవన్ OG లో ఖైదీ ఫేమ్ అర్జున్ దాస్

క్రిస్మస్ కు పవన్ OG?

బాబాయ్ మాసీ గ్లింప్స్ చరణ్ రియాక్షన్

యాక్షన్ ప్యాక్డ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ నెక్ట్స్ షెడ్యూల్

పూణే లో పవన్ OG కొత్త షెడ్యూల్
ప్రీ క్లైమాక్స్ లో హరిహర వీరమల్లు
ఓజి షూటింగ్ అప్‌డేట్
కీలక సన్నివేశాల చిత్రీకరణలో పవన్ OG

ఓజిలోకి ప్రకాష్ రాజ్
ఉస్తాద్ భగత్ సింగ్ ఎడిటింగ్ ప్రారంభం

పవన్-తేజ్ మూవీ అద్భుతంగా వస్తుంది

OG సెట్ లో అడుగుపెట్టిన పవన్

ఓజీకి ఏ సర్టిఫికెట్ ..రన్ టైం రివీల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న గ్యాంగ్ స్టార్ మూవీ ఓజీ మరో 2 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యి సినిమాపై అంచనాలు పెంచేశాయి.ఇక నిన్న ట్రైలర్ కూడా విడుదల కాగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఫుల్ యాక్షన్ కట్ తో వచ్చిన ఈ ట్రైలర్ అంచనాలను అందుకొని హైప్ ను డబుల్ చేసింది.

ఓజీ.. జపనీస్ సాంగ్ పాడిన పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న 'ఓజీ' ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలోని ఒక్కో అంశం అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా, చిత్ర బృందం అభిమానుల కోసం ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్వయంగా 'వాషి యో వాషి' అనే పాటను పాడారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్ స్టైల్, గంభీరమైన గొంతు ఫ్యాన్స్‌కు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

హరి హర వీర మల్లు.. ఎపిక్ వార్ సీక్వెన్స్‌తో షూటింగ్ షురూ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రజాసేవకు తన సమయాన్ని కేటాయిస్తున్నారు. అదే సమయంలో తాను అంగీకరించిన సినిమాలను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన కథానాయకుడిగా 'ఓజీ' 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హర వీర మల్లు' చిత్రాలు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

ఓజీ గ్లింప్స్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓజీ గ్లింప్స్ కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది.ఈరోజు పవన్ బర్త్ డే సందర్భంగా ఈటీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.100 సెకండ్ల రన్ టైంతో వచ్చిన ఈ గ్లింప్స్ హైప్ కు ఏమాత్రం తగ్గకుండా వుంది.గ్లింప్స్ అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ గా పవన్ రూత్ లెస్ గ్యాంగ్ స్టర్ గా కనిపించాడు.గ్లింప్స్ లో పవన్ లుక్,తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యింది.పవన్ ను ఇంతకుముందు ఎప్పుడూ చూపించని విధంగా చూపిస్తున్నాడు డైరెక్టర్ సుజీత్.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న 'బ్రో' మూవీ
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరియు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ నటుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. జులై 28న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయిన ‘బ్రో’ సినిమా పవర్ స్టార్ స్టామినా ఏంటో చూపించింది. విడుదలైన తొలిరోజే రూ.30 కోట్ల షేర్‌ను కొల్లగొట్టడంతో పాటు తర్వాతి రెండు రోజుల్లోనే వంద కోట్ల మార్క్ అందుకుంది. ఈ సినిమాలో ‘టైమ్ ఆఫ్ గాడ్’ పాత్రలో పవన్ కల్యాణ్ చేసిన మ్యాజిక్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. మనిషి జీవితంలో కాలం…
బ్రో టీజర్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడింది.ఎప్పటినుండో ఎదురుచూస్తున్న బ్రో టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది.ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ కు సూపర్ రెస్పాన్స్ రాగ ఇక ఈ టీజర్ కూడా చాలా ఇంట్రస్టింగ్ వుంది.1:27 నిమిషాల టీజర్ లో పవన్ చెప్పిన డైలాగ్స్ తోపాటు పవన్ స్టైలిష్ మేక్ ఓవర్ హైలైట్ అయ్యాయి.మొత్తానికి టీజర్ తో సూపర్ హైప్ తెచ్చారు మేకర్స్.ఇక ఈటీజర్ యు ట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.

అఫీషియల్- పవన్ OG లో ఖైదీ ఫేమ్ అర్జున్ దాస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాలతో కూడా బిజీగా ఉంటూ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పవన్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అందులో సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమా కూడా ఒకటి. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా ప్రస్తుతానికి ఓజీ అనే టైటిల్ తోనే షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమాలో ఖేదీ ఫేమ్ అర్జున్ దాస్ నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో అర్జున్ దాస్…

క్రిస్మస్ కు పవన్ OG?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో సుజిత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. ఈసినిమా ఓజీ అనే టైటిల్ తో తెరకెక్కుతుండగా పవన్ కళ్యాణ్ ఇందులో గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా షూటింగ్ ను మాత్రం చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు మేకర్స్. గత నెలలో ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టగా ముంబైలో కొంత వరకూ.. ఆ తరవాత పూణేలో కొద్ది రోజులు షూటింగ్ ను పూర్తి చేశారు. దీంతో ఒక కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది చిత్రయూనిట్.

బాబాయ్ మాసీ గ్లింప్స్ చరణ్ రియాక్షన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు. కేవలం చిన్న గ్లింప్స్ తో రాంపేజ్ ఆడిస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఇన్ని రోజులు తను వెయిట్ చేసిన దానికి ఫలితంగా ఈసినిమాను అంతే కసిగా హరీష్ శంకర్ తీస్తున్నట్టు రెండు రోజుల క్రితం రిలీజ్ చేసిన గ్లింప్స్ తో అర్థమైంది. పవన్ ఫ్యాన్స్ కు ఈ గ్లింప్స్ తో ఫుల్ మీల్స్ అందించాడు హరీష్. పవన్ కళ్యాణ్ పక్కా మాస్ పోలీస్ ఆఫీసర్‌గా…

ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ రిలీజ్ : ఈ సారి బద్దలైపోద్ది
ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా వుండబోతుందో డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక చిన్న గ్లింప్స్ తో చెప్పేసాడు.కొద్దీ సేపటి క్రితం మేకర్స్ ఈసినిమానుండి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.42 సెకండ్ల రన్ టైంతో వచ్చిన ఈవీడియో ఫుల్ మాస్ గా వుంది.హరీష్ మార్క్ డైలాగ్స్,పవన్ కళ్యాణ్ లుక్,మ్యానరిజం,దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈవీడియో లో హైలైట్ అయ్యాయి.భగవద్గీతలోని శ్లోక సారాంశంతో గ్లింప్స్ మొదలవ్వగా ఆతరువాత భగత్ సింగ్ గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు పవన్ కళ్యాణ్.. ఓవరాల్ గా గ్లింప్స్ చూస్తుంటే ఉస్తాద్ భగత్ సింగ్,గబ్బర్ సింగ్ ను మించి ఉండేలాగే వుంది.ఇక ఇంతకుముందు పవన్,హరీష్ కాంబినేషన్ లో వచ్చిన…

ఉస్తాద్ భగత్ సింగ్ స్పెషల్ డే కి బ్లాస్టింగ్ గ్లింప్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా ఇప్పటికే ఫస్ట షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అంతేకాదు మరోపక్క ఎడిటింగ్ పనులను కూడా మొదలుపెట్టేశారు. మరోవైపు సెకండ్ షెడ్యూల్ కు సన్నాహాలు చేస్తున్నట్టు ఇప్పటికే అప్ డేట్ కూడా ఇచ్చారు హరీష్ అండ్ టీమ్. ఇక ఇప్పుడు మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ వచ్చింది. స్పెషన్ డే కు ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. ఆ స్పెషన్ డేట్ మరేదో కాదు మే 11. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్…

యాక్షన్ ప్యాక్డ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ నెక్ట్స్ షెడ్యూల్
గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హిట్ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై మొదటి నుండీ మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన సంగతి తెలిసిందే కదా. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందో లేదో ఎడిటింగ్ పనులు కూడా మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు కొత్తు షెడ్యూల్ కు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అంతేకాదు ఈసినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలుపెట్టారు.

పూణే లో పవన్ OG కొత్త షెడ్యూల్
పవర్ స్టార్ మాత్రం ప్రస్తుతం బ్రేక్స్ లేకుండా సినిమా షూటింగ్ లను పూర్తి చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పవన్ చేతిలో పలు ప్రాజెక్ట్ ఉండగా అందులో సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఈసినిమా ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) అనే టైటిల్ తో వస్తుంది. టైటిల్ కు తగ్గట్టే ఈసినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ ముంబై లో ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. ఈ ఫస్ట్ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. రీసెంట్ గానే అక్కడ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అప్పుడే మరో షెడ్యూల్ ను ప్రారంభించేశారు. పూణేలో ఓజీ కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేసినట్టు…
ప్రీ క్లైమాక్స్ లో హరిహర వీరమల్లు
క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొఘలాయిల పాలన నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. మరోవైపు ఈసినిమా కోసం పవన్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఓజి షూటింగ్ అప్డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) మొదటి షెడ్యూల్ ఈరోజుతో ముగిసింది. గత నెలలో ఈసినిమా షూటింగ్ ముంబై లో ప్రారంభం కాగా ఈరోజు తో తొలి షెడ్యూల్ కంప్లీట్ అయ్యిందని మేకర్స్ ప్రకటించారు.ఈసందర్భంగా పవన్ స్టిల్ ను రిలీజ్ చేశారు.ఈస్టిల్ లో పవన్ లుక్ అదిరిపోయింది. ఈ స్టిల్ కి సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తుంది.ఇక మొదటి షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను తెరక్కించారు.తదుపరి షెడ్యూల్ మహాబలేశ్వర్ లో జరుగనుంది.ఈషెడ్యూల్ లో పవన్ అలాగే హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక మోహన్ లపై పాటను చిత్రీకరించనున్నారు.
కీలక సన్నివేశాల చిత్రీకరణలో పవన్ OG
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఈసినిమా ఓజీ అనే టైటిల్ తో రూపొందుతుంది. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు మేకర్స్. ముంబైలో వేసిన ప్రత్యేకమైన సెట్లో షూటింగ్ ను జరుపుకుంటుంది. పవన్ కూడా ఇప్పటికే షూటింగ్ లో పాల్గొన్నారు కూడా. ఇక ఈసినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా నటిస్తున్నాడు. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. ముంబైలో ఈసినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నామని.. ప్రకాష్ రాజ్ నేటి నుండి షూట్ లో జాయిన్ అవుతున్నారని తెలిపుతూ ట్విట్టర్ ద్వారా…

ఓజిలోకి ప్రకాష్ రాజ్
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) మొదటి షెడ్యూల్ ముంబై లో జరుగుతుంది.పవన్ ఈషెడ్యూల్ లో 5రోజులు షూటింగ్ లో పాల్గొనగా హీరో, హీరోయిన్ తో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.ప్రస్తుతం మిగితా క్యాస్ట్ తో షూటింగ్ చేస్తున్నారు.ఇక ఈసినిమాలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈరోజు ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.సుజీత్ డైరెక్షన్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఉస్తాద్ భగత్ సింగ్ ఎడిటింగ్ ప్రారంభం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల లిస్ట్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ముందు ఉంటుంది. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాను ప్రకటించిన దగ్గరనుండే అంచనాలు పెరిగిపోయాయి. ఈసినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. మరో షెడ్యూల్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

పవన్-తేజ్ మూవీ అద్భుతంగా వస్తుంది
మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా రావడంతో అన్ని వర్గాల వారిని అలరిస్తుంది. నాలుగు రోజుల్లో ఈసినిమా 50 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి సాయి తేజ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందుకున్నాడు. ఇక ఈసినిమా మంచి సక్సెస్ అవ్వడంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు సాయి తేజ్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలియచేశారు. ఇక దీనికి గాను సాయి తేజ్ తన సోషల్ మీడియా ద్వారా కతజ్ఞతలు చెప్తూ.. తమ బ్యానర్ నుండి వస్తున్న వినోదయ సితం రీమేక్ మూవీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.

OG సెట్ లో అడుగుపెట్టిన పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలపైన ఫోకస్ పెట్టారు. ఇప్పుడు వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ఒక సినిమా తరువాత మరో సినిమా షూటింగ్ లో పాల్గొంటూ సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు. ఇప్పటికే సముద్రఖని సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. రీసెంట్ గానే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఒక వారం రోజులు ఆసినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇక ఇప్పుడు సుజీత్ సినిమాకు రెడీ అయ్యాడు.